హిమజ మంచి నటి. అందంగా ఉంటుంది. పలు సినిమాల్లో కామెడీ టచ్ ఉండే రోల్స్ ఎక్కువగా చేసి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె లుక్స్ పై కెరీర్ ప్రారంభంలో చాలా కామెంట్స్ వచ్చాయట.
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇందులో ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉంటాయి. చాలామంది బ్యూటీస్ నటిగా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేసి క్రేజ్ తెచ్చుకుంటారు. అయితే ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తాము జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని బయటపెడుతూ ఉంటారు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుని చిన్న చిన్న పాత్రలు చేస్తున్న హిమజ కూడా అలాంటి ఓ విషయాన్ని బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో తనపై చేసిన కామెంట్స్ వల్ల ఘోరంగా ఏడ్చానని పేర్కొంది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన హిమజ, మోడల్ గా పలు యాడ్స్ కనిపించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘శతమానం భవతి’, ‘ధృవ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘వినయ విధేయ రామ’, ‘వరుడు కావలెను’ తదితర చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొన్న ఈమె.. యూట్యూబర్ గానూ పేరు తెచ్చుకుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న హిమజ.. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ తన కెరీర్ స్టార్టింగ్ చేసిన అనుభవాల గురించి బయటపెట్టింది. ఇందులో తన కళ్లు, నడక గురించి వచ్చిన కామెంట్స్ ఏంటనేవి చెప్పింది.
‘అందరిలానే నేను కెరీర్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఒకానొక టైంలో ఘోరంగా ఏడ్చాను కూడా. సొసైటీ మనల్ని చూస్తుంది. మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా మనకు తెలిస్తే, మనం చేసే పని సరైనది అయితే ఎవరు చెప్పిన ఆగాల్సిన అవసరం లేదు. నమ్మకం, ధైర్యంతో ముందుకు సాగాలి. పనికిరాని మాటలు విని వదిలేయండి. కెరీర్ స్టార్టింగ్ లో నాపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. లుక్స్ బాగోలేవు. కళ్లు చిన్నగా ఉన్నాయని డైరెక్టర్సే అన్నారు. అప్పుడు కాస్త బాధేసింది. కానీ మేకప్ వేసుకున్న తర్వాత నా కళ్లే హైలైట్ అయ్యాయి. బాలేవ్ అన్నవాళ్లే బాగున్నాయని చెప్పారు. నా నడక కూడా మగరాయుడిలా ఉంటుందని అన్నారు. ఇక సోషల్ మీడియాలో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. పాజిటివ్ ని తీసుకున్నట్లే నెగిటివ్ ని భరించాలి.’ అని హిమజ చెప్పుకొచ్చింది. మరి ఈమె వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామంట్ చేయండి.