బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్‌లో మరోసారి రేవంత్ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. ఈసారి విన్నర్ అయ్యేవాళ్లకు ఏడుపు ఒక్కటే తక్కువ అని చెప్పాలి. ఇంక ఈవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. రాజ్ కూడా నామినేషన్స్ లో ఉండగా.. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుని విన్నింగ్ అమౌంట్ నుంచి రూ.4,99,700 త్యాగంచేసి ఈ వారం సేవ్ అయ్యాడు. ఫైమా కెప్టెన్ కాబట్టి ఈవారం నామినేషన్స్ లో లేదు. మిగిలి వాళ్లంతా నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఎవరు ఈవారం ఎలిమినేట్ అవుతారని అంతా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తున్న లీకుల ప్రకారం ఈ వారం.. జంటను విడదీయబోతున్నారు. రోహిత్‌ని సేవ్ చేసి.. మెరీనాని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారంట.
నిజానికి బయట అనధికారిక ఓట్ల పోలింగ్ ప్రకారం శ్రీసత్య కూడా డేంజర్ జోన్‌లోనే ఉంది. కానీ, ఈవారం ఫ్యామిలీ ఎపిసోడ్ ఉంది కాబట్టి.. ఆమెను పంపేస్తే ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ కాదు కాబట్టి ఈ ప్లాన్ చేశారని చెబుతున్నారు. అదే మెరీనాని ఎలిమినేట్ చేసినా కూడా ఆమే అతని కోసం హౌస్‌లోకి వస్తుంది, లేదా స్టేజ్ మీదకు తీసుకొస్తారు. సో అలా అయినా రేటింగ్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే మెరీనాని పంపేసినట్లు చెబుతున్నారు. రాజ్‌ని చాలా లక్కీ అని చెప్పొచ్చు అండర్ రేటెడ్ కంటెస్టెంట్‌గా వచ్చి స్ట్రాంగ్ ప్లేయర్ అయిపోయాడు. పైగా అతనికి లక్ కూడా బాగా కలిసొస్తోంది. ఇంక రోహిత్ విషయానికి వస్తే.. అతను కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఎంతో డీసెంట్ కూడా రియల్ జంటిల్‌మెన్‌లా ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఇంక మెరీనా విషయానికి వస్తే.. గేమ్ పరంగా స్టార్టింగ్‌తో పోలిస్తే చాలా బాగా ఆడుతోంది. ఇద్దరూ కలిసి ఆడుతున్నారనే అపవాదును కూడా చాలా సందర్భాల్లో పోగొట్టుకున్నారు. ఇంట్లో కూడా ఇండివిడ్యూవల్‌గా ఆమెను ఆమె ప్రూవ్ చేసుకుంది. కానీ, ఫిజికల్ టాస్కుల్లో అంత స్ట్రాంగ్ అని నిరూపించుకోలేకపోయింది. అంతేకాకుండా చాలాసార్లు అసలు అవకాశం కూడా రాలేదనే చెప్పాలి. వంటింట్లోనే ఉంటోంది అనే మాటలకు చెక్ పెడుతూ అన్ని పనులు, టాస్కుల్లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టింది. అంతేకాకుండా కపుల్‌ని బ్రేక్ చేస్తే కాస్త ఎమోషనల్ కూడా వర్కౌట్ అవుతుందని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం దాదాపు మెరీనానే ఎలిమినేట్ అవుతుందని చెబుతున్నారు. వెంటనే ఫ్యామిలీ ఎపిసోడ్‌లో మళ్లీ స్టేజ్‌మీద మెరీనాను చూడచ్చు.