సాధారణంగా అటు వెండితెరపై గానీ.. ఇటు బుల్లితెరపైగా కాంబినేషన్ కు ఉన్న క్రేజే వారు. ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జయసుధ, చిరంజీవి-విజయశాంతి లాంటి జంటలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బుల్లితెర విషయానికి వస్తే.. డాక్టర్ బాబు-వంటలక్క ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇకపోతే.. ప్రస్తుతం సుధీర్-రష్మీ ల జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేసే ఉంది. వాళ్లు పెళ్లి చేసుకుంటారా అన్నంతగా వారి మధ్య కెమిస్ట్రీ పండుతుంది. అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ ప్రేమ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి దానికి కారణం..
బిగ్ బాస్.. బుల్లితెర సంచలన షోలల్లో ఒకటిగా నిలిచింది. ఈ షో ప్రారంభం నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ వరుస సీజన్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అవుతుండగా.. మెుదట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మధ్యలో దారుణమైన రేటింగ్స్ తో ఒక్కసారిగా దిగజారింది. రోజులు గడుస్తున్న కొద్ది, ఎలిమినేషన్ అవుతున్న కొద్ది షో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ వాళ్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు. దాంతో హౌజ్ లో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. హౌజ్ లో ఉన్న అందరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. కానీ కీర్తి భట్ కు ఎవరూ లేకపోవడంతో ఎవరొస్తారా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో.. ‘మనసిచ్చి చూడు’ సీరియల్ హీరో మహేష్ బాబు అలియాస్ ఆది.. కీర్తి కోసం నేనున్నాను అంటూ హౌస్ లోకి అడుగు పెట్టాడు. దాంతో ఎమోషనల్ కు గురైంది కీర్తి. నేకు నేనున్నాను.. లక్షలాది మంది అభిమానుల ఆశీర్వాదం ఉంది. నువ్ టైటిల్ గెలిచిరా.. అంటూ ఆది చెప్పాడు. ఇంకాస్త రొమాంటిక్ గా రెడ్ రోజ్ తో కీర్తికి ప్రపోజ్ చేశాడు ఆది. మహేష్ బాబు-కీర్తి భట్ లు ‘మనసిచ్చి చూడు’ సీరియల్లో ఆది-భానులుగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సీరియల్ తో ఈ జోడీకి ఎంతో క్రేజ్ వచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో అప్పటి నుంచి వీరి పేర్లు ఆది, భానులుగా మారాయి. కీర్తితో ఉన్న బాండింగ్ కారణంగానే బిగ్ బాస్ హౌజ్ లోకి తన కుటుంబ సభ్యుడిగా అడుగుపెట్టాడు. దాంతో ఈ జోడీపై పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. కీర్తి కోసం ఆది వెళ్లడంతో నిజంగానే వీరు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు ఆది.”బుల్లితెరలో మా ఇద్దర్నీ రొమాంటిక్ కపుల్ గా పిలుస్తారు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. నేను మ్యారేజ్ చేసుకుంటే నా వైఫ్ తో రోమాంటిక్. తను పెళ్లి చేసుకుంటే తన భర్తతో రోమాంటిక్” అంటూ సమాధానం చెప్పాడు ఆది. మరి ఆమె భర్త మహేషేనా అంటే ఏమో అయ్యుండొచ్చు.. మహేష్ అంటే నేను ఒక్కడినే కాదు కదా.. చాలా మందే ఉంటారు అంటూ తెలివిగా ఆన్సర్ చేశాడు. ఇక మమ్మల్ని చాలా మంది రియల్ కపుల్ అనుకుంటున్నారు. అది ఒకవిధంగా సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఎక్స్ ట్రీమ్ కాకుడదని ఆది చెప్పుకొచ్చాడు. అదీగాక నేను ఎక్కడికి వెళ్లినా కీర్తి గురించి అడుగుతారని మహేష్ అలియాస్ ఆది చెప్పుకొచ్చాడు.