ఈ మధ్య కాలంలో నటీనటులు ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా, పలువురు నటీనటులు కూడా తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. నార్మల్ గా సినీ సెలబ్రిటీల మ్యారేజ్, నిశ్చితార్థ వేడుకలకు సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వేడుకలని.. అభిమానులు తమ ఇంటి ఈవెంట్ లా ఫీలవుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో కొందరు అందరికీ చెప్పి మ్యారేజ్ చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సీరియల్ నటి త్రిష పెళ్లి ఫొటోలు తాజాగా వైరల్ అయ్యాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్మాల్ స్క్రీన్ పై బాలనటిగా కెరీర్ ప్రారంభించిన త్రిష.. ప్రస్తుత వరస ఛాన్సులు దక్కించుకుంటోంది. స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయిన ‘మనసిచ్చి చూడు’ సీరియల్ లో కీర్తిభట్ చెల్లెలు రేణు పాత్రలో నటించిన త్రిష.. ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె ఏ సీరియల్లో కనిపించడం లేదు. ఇక కొన్ని రోజుల ముందు త్రిష ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఏకంగా పెళ్లిచేసుకుని కనిపించింది. దీంతో త్రిష పెళ్లి చేసుకోవడం నిజమేనని తేలింది.
ఇక త్రిషతో ఏడడుగులు వేసిన వ్యక్తి పేరు విశాల్. అతడి గురించి వివరాలు పెద్దగా బయటకు రాలేదు. మరోవైపు త్రిష పెళ్లికి హాజరైన పలువురు సీరియల్ యాక్టర్స్… కొత్త జంటని మనసారా దీవించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా త్రిష-విశాల్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌసులో ఉండిపోవడం వల్ల రాలేకపోయింది కానీ లేదంటే కీర్తి భట్ కూడా.. ఈ పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్విందించేది. మరి సీరియల్ నటి త్రిష పెళ్లి ఫొటోలు మీకెలా అనిపించాయి.