తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. తాజాగా ఆరవ సీజన్ కూడా విజయవంతగా ముగిసింది. దాదాపు వంద రోజులకి పైగా సాగిన బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ గా ఫేమస్ సింగర్ రేవంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్ రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతడే ఆదిరెడ్డి అలియాస్ ఉడాల్ మామ. సామాన్యుడి స్థాయి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, ఆ తరువాత టాప్ -4 లో ఒకడిగా నిలవడం వరకు అతడు సాగించిన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి. ఆదిరెడ్డి బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు.. కానీ ప్రేక్షకుల మనస్సును మాత్రం గెలిచాడు. సామాన్యుడి స్థాయి నుంచి ఓ సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ జర్నీని గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. ‘ఎక్కడ లూజు లూజు బట్టలు వేసుకుని, ఉన్న బట్టలతో సర్ధుకుపోయిన ఆ ఆదిరెడ్డి.. సూట్ బూటు వేసుకుని బిగ్ బాస్ హౌస్ లో అందరి ముందు దర్జాగా తిరిగిన ఆదిరెడ్డి ఎక్కడ’ అంటూ ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యారు.
తాను ఎన్నో కష్టాలు అనుభవించానని, తన చెల్లెలు నాగలక్ష్మి పెన్షన్ తో కొంతకాలం తమ కుటుంబం బతికిందని తెలిపారు. తనకి ఎలాంటి ఉద్యోగం లేని సమయంలోనే కవిత ఆయనను వివాహం చేసుకున్నట్లు ఆదిరెడ్డి తెలిపారు. తన తండ్రి ఎన్నో కష్టాలకు ధైర్యంగా నిలబడి.. ఈ రోజు నా విజయాన్ని కళ్లారా.. చూశాడని ఆదిరెడ్డి అన్నారు. ఇంకా తన జర్నీ గురించి ఆదిరెడ్డి మాట్లాడుతూ….” లూజు లూజు బట్టలు వేసుకుని, ఉన్న బట్టలతో సర్ధుకుపోయిన ఆ ఆదిరెడ్డి ఎక్కడ …. సూట్ బూటు వేసుకుని బిగ్ బాస్ హౌస్ లో అందరి ముందు దర్జాగా తిరిగిన ఆదిరెడ్డి ఎక్కడ. అందరు జాలిగా చూసిన నా ఊరు ఎక్కడ. ఈ రోజు నా ఊరు మొత్తం గర్వపడేలాగా బిగ్ బాస్ హౌస్ లో టాప్-4 వరకు సాగిన నా జర్నీ ఎక్కడ. ఇలా నా జర్నీని గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. అందరికి సమస్యలు ఉంటాయి. అందరికి ఓకే రకమైన సమస్యలు ఉండవు. అయితే వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొవాలి. నేను మా చెల్లిని, మానాన్నను చూసుకుంటునే బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్లాను. నేను ఎవరికి చెప్పే అంత స్థాయిలో లేను కానీ.. కష్టాలు అందరికి ఉంటాయి. వాటిని ఎదుర్కొంటు నిలదొక్కుని, ఎదిగి.. నువ్వు పది మందికి స్ఫూర్తిగా ఉండాలి.
మా అమ్మ కష్టాలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెలాగా ఇలా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే కష్టాల వెనుక సుఖాలు కచ్చితంగా ఉంటాయి. మనం కష్టాలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటే ఆ విజయాలను చూడలేము. అందుకు ఉదాహరణ మా అమ్మే.. ఆమె ఇప్పుడు బతికి ఉంటే మహరాణిలాగా చూసుకునే వాడిని. మా అమ్మ ఎవరిదైన పెళ్లికి వెళ్లాలంటే బంధువులను నగలు అడిగేది. అంతటి పేదరికాన్ని అనుభవించింది. ఇప్పుడు ఉండి ఉంటే ఆమె ఒంటి నిండ బంగారం వేసేవాడ్ని. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుని చనిపోతే భవిష్యతు లో వచ్చే సంతోష క్షణాలను పొందలేము. ఊరు మొత్తం జాలిగా చూసిన ఆదిరెడ్డి ఎక్కడా.. అదే ఊరు గర్వపడేలా చేసిన బిగ్ బాస్ లోకి వెళిన ఆదిరెడ్డి ఎక్కడ. చాలా రెట్లు విజయం సాధించాను. ఇంతకంటే సంతోషం నాకు ఇంకొకటి లేదు” అంటూ ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి లైఫ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.