బిగ్ బాస్ షో పేరు చెప్పగానే జోడీలే గుర్తొస్తాయి. ఓ సీజన్ బాయ్ ఫ్రెండ్.. మరో సీజన్ లో అతడి గాళ్ ఫ్రెండ్, కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం చూస్తూనే ఉన్నాయి. ఈ విషయం గురించి మట్లాడుకుంటే ముందు గుర్తొచ్చేది శ్రీహాన్-సిరినే. ఎందుకంటే ఐదో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన సిరి.. ఫైనల్ వరకు వెళ్లింది. ఇక ప్రస్తుత సీజన్ శ్రీహాన్ కూడా బాగానే ఆడుతున్నారు. టాప్-5లో కచ్చితంగా ఉంటాడనిపిస్తోంది. రీసెంట్ గానే హౌసులోకి వచ్చిన సిరి.. శ్రీహాన్ తో కలిసి స్టెప్పులేసింది. ఇది జరిగి రెండో రోజులు కూడా కాలేదు. అప్పుడే వీళ్లపై సోహెల్ పంచులేశాడు. అదికాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6, గత సీజన్లతో పోలిస్తే తేలిపోయింది. కానీ కొంతవరకైనా సరే ఎంటర్ టైన్ ఇవ్వాలని షో ఆర్గనైజర్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా షో చివర దశకు చేరుకోవడంతో ఎమోషనల్ టచ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ఈ వీక్.. ఒక్కో కంటెస్టెంట్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, దగ్గర వాళ్లని హౌసులోకి తీసుకొచ్చారు. అవన్నీ కూడా బాగానే ఎంటర్ టైన్ చేశాయి. ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి.. హౌస్ మేట్స్ కి ఫ్రెండ్స్ ని షోకి తీసుకొచ్చారు. అలా శ్రీహాన్ కోసం అతడి తండ్రితోపాటు బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ వచ్చాడు. శ్రీహాన్ పై పంచులు కూడా వేశాడు.
అయితే ఇనయా కోసం షోకు వచ్చిన బిగ్ బాస్ సోహెల్.. హౌస్ మేట్స్ అందరితోనూ మాట్లాడుతూ ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. ఇక శ్రీహాన్ తో మాట్లాడుతూ.. సిరి టాటూ పర్మినెంట్ కాదు, మోసపోవద్దు అని ఫన్నీ కామెంట్స్ చేశాడు. నమ్మొద్దు, నమ్మొద్దు అని పాట పాడటానికి కూడా ట్రై చేశాడు. కానీ ఆపేశాడు. ఈ మొత్తం సెగ్మెంట్ ని తాజా ప్రోమోలో చూపించారు. ఇది బిగ్ బాస్ ఫ్యాన్స్ ని తెగ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా హౌసులోకి వచ్చిన సిరి, శ్రీహాన్ పేరుని భుజంపై టటూ వేసుకున్నట్లు కెమెరాకు చూపించింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో యూజర్లను ఆకట్టుకుంది. అలానే ఇప్పుడు సోహెల్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. మరి సిరి-శ్రీహాన్ బాండింగ్ పై సోహెల్ వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.