బిగ్ బాస్ 6 ఎట్టకేలకు పూర్తయిపోయింది. చాలామంది ముందు నుంచి ఊహించినట్లే సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు. గెలవడం ఏమో కానీ అతడి ముఖంలో పెద్దగా ఆనందం కనబడలేదు. దానికి కారణం రన్నర్ గా నిలిచిన శ్రీహాన్. వీళ్లిద్దరూ కూడా చివరి నిమిషం వరకు హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడ్డారు. కానీ చివరలో జరిగిన డ్రామా మాత్రం మొత్తం రిజల్ట్ నే మార్చిపడేసింది. ఇలాంటిది ఇప్పటివరకు ఏ సీజన్ లోనూ చూసుండరు. హోస్ట్ నాగార్జున చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కి అయితే ప్రేక్షకులదే కాదు శ్రీహాన్ కి కూడా మైండ్ పోయేలా చేసింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు తిట్టుకుంటుంటే.. మరికొందరు మాత్రం వావ్ అంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి బిగ్ బాస్, ఎందుకో గానీ గత సీజన్లతో పోలిస్తే చాలా డల్ గా సాగింది. షోలో డ్రామా లేకపోవడం, తెలియని వాళ్లే ఎక్కువమంది కంటెస్టెంట్స్ గా ఉండటం వల్ల కావొచ్చు. ప్రారంభ ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులు షోని కాస్త దూరం పెట్టారు. కొన్నివారాల పాటు పెద్దగా గొడవలు, ప్రేమలు లాంటివి లేకపోవడంతో టీఆర్పీ రేటింగ్స్ కూడా తక్కువగానే వచ్చినట్లు కనిపించింది! దీంతో బిగ్ బాస్, డైరెక్ట్ గానే కంటెస్టెంట్స్ ని తిట్టినంత పనిచేశాడు. ఇష్టం లేకపోతే ఇంటినుంచి బయటకెళ్లిపోమన్నాడు. ఇక అప్పటినుంచి షోలో గొడవలు, రిలేషన్స్ లాంటి వాటిని హౌస్ మేట్స్ స్టార్ చేశారు. మరోవైపు ప్రతి వారం నామినేషన్స్ లో రేవంత్ ఉంటూనే వచ్చాడు. అతడికి గీతూ, ఇనయా, శ్రీహాన్ లాంటి వాళ్లు చాలా పోటీఇస్తూ వచ్చారు.
రేవంత్.. బిగ్ బాస్ లోకి రాకముందే సింగర్, యాంకర్ గా ప్రేక్షకులకు చాలామందికి తెలుసు. దీంతో ప్రతివారం నామినేషన్స్ లో ఉన్నా సరే అతడికే ఎక్కువ ఓట్లు పడేవి. దీంతో ప్రతిసారి సేవ్ అవుతూనే వచ్చాడు. అది గేమ్ కావొచ్చు, టాస్క్ కావొచ్చు రేవంత్ తన బెస్ట్ ఇస్తూనే వచ్చాడు. ఇక షో మధ్యలో గీతూ, ఆర్జే సూర్య లాంటి వాళ్లు ఎలిమినేట్ కావడంతో రేవంత్ కు పోటీ ఇచ్చేది ఎవరా అని ప్రేక్షకులు ఆలోచనలో పడిపోయారు. అలాంటి టైంలో కొన్ని వారాల పాటు ఇనయా కనిపించింది. కానీ ఫినాలేకు సరిగ్గా వారం ముందు ఆమె కూడా ఎలిమినేట్ అయి, హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అందరూ శ్రీహాన్, రేవంత్ కి సరైన పోటీదారుడు అని ఫిక్సయిపోయారు.
ఇక ఫినాలేకు అర్హత సాధించిన తొలి వ్యక్తి శ్రీహాన్. ఇతడి ప్రేయసి సిరి.. గత సీజన్ లో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. ఆ సీజన్ లో శ్రీహాన్ ఓసారి ఆమెని సపోర్ట్ చేయడానికి వచ్చాడు. ఇక తర్వాత కూడా షో గురించి సిరి అతడికి చెప్పే ఉంటుంది! ఈ క్రమంలో బిగ్ బాస్ అంటే ఏంటి? ఎలా ఉండాలి? ఎలా ఆడాలి? అనే విషయాలు తెలుసుకుని శ్రీహాన్ హౌసులో అడుగుపెట్టాడు. కానీ చివర్లో రూ.40 లక్షల సూట్ కేసు తీసుకోవడంతో విన్నర్ కాలేకపోయాడు. కానీ ఓట్ల పరంగా విన్నర్ శ్రీహాన్ అని హోస్ట్ నాగార్జునే చెప్పాడు. ఇక టైటిల్ గెలిచిన రేవంత్ కు రూ.10 లక్షలు మాత్రమే దక్కింది. టైటిల్ గెలిచినా సరే డబ్బు దక్కించుకోలేకపోయానే బాధ రేవంత్ కు, డబ్బు సొంతం చేసుకున్న చేతిదాకా వచ్చిన టైటిల్ అందుకోలేకపోయాననే బాధ శ్రీహాన్ కి ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. ఇలా చాలా డ్రామాతో బిగ్ బాస్ ఫినాలే జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్-శ్రీహాన్ బాగానే పోటీపడ్డారు. కానీ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని రాయండి.
Congratulations to #Revanth, the winner of #BiggBossTelugu6 🏆#BBTeluguGrandFinale #BiggBossTelugu @iamnagarjuna @singerrevanth @StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/DTDtEZ1cW3
— starmaa (@StarMaa) December 18, 2022