‘బిగ్ బాస్’ షోలో వారం మొత్తం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాసరే వీకెండ్ మాత్రం ఫుల్ మస్తీ. ఎందుకంటే మిగతా రోజులు రెగ్యులర్ డ్రస్సులో కనిపించే హౌస్ మేట్స్ అందరూ.. శని-ఆదివారం బిందాస్ గా రెడీ అవుతారు. ప్రేక్షకులకు కూడా గ్లామర్ విందు ఇస్తారు. ఈసారి కూడా అందులో అస్సలు తీసిపోలేదు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్ కాస్త ఫన్, మరికాస్త సీరియస్ గా సాగింది. ఆదివారం ఎపిసోడ్ మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 6 సండే ప్రోమో చూస్తే అలానే అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6 ఆదివారం ప్రోమోలో గ్లామర్ గా కనిపించిన హోస్ట్ నాగార్జున స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడు. అందరితో నవ్వుతూ మాట్లాడాడు. వెరైటీగా కొన్ని ఆటలు ఆడబోతున్నామని చెప్పాడు. ‘ఎవరికి ఎంత తెలుసు’ పేరుతో ఉన్న ఈ గేమ్ ని రూపొందించారు. ఇందులో భాగంగా శ్రీహాన్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ ఎక్స్ ప్లోర్ చేసిన ఫ్లేస్ ఏంటి, ఆర్జే సూర్య ఎంతమందిని మిమిక్రీ చేయగలడు లాంటి క్వశ్చన్స్ వేశారు.
ఆ ప్రశ్నలకు పార్టిసిపెంట్స్ కొందరు బజర్ ప్రెస్ చేసి, కరెక్ట్ సమాధానాలు చెప్పారు. ఇక ఈ రౌండ్ మొత్తం ఫుల్ ఫన్నీగా సాగింది. దీని తర్వాత కెప్టెన్ బాలాదిత్యతో నాగ్ మాట్లాడారు. హౌస్ లో బుట్టబొమ్మ ఎవరు అని అడగ్గా.. మెరీనా అని సమాధానమిచ్చాడు. ఇక శ్రీసత్య… శేఖర్ కమ్ముల సినిమా హీరోయిన్ అని, వాసంతి.. గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అని బాలాదిత్య చెప్పాడు. ఇక ఫైమా గురించి చెబుతూ ‘పుష్ప’ రిఫరెన్స్ ఉపయోగించాడు. ఇక గీతూ గురించి అడిగినప్పుడు ఆమె తనని తాను టెంకాయతో పోల్చుకుంది. ‘బేసిక్ గా పగలగొట్టాలంటావ్’ అని నాగ్ అదిరే పంచేశారు. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఈ వారం బిగ్బాస్ ఎలిమేషన్లో ట్విస్ట్.. ఎలిమినేషన్ లేనట్టే!