బిగ్ బాస్ షో అంటే ఎంటర్ టైన్ మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ట్విస్టులు కూడా అలానే ఉంటాయి. హౌసులో పలానా కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, భలే ఆడుతున్నాడు అనుకుంటాం. అతడు/ఆమె ఆ వెంటనే ఎలిమినేట్ అయిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అది బిగ్ బాస్ కాబట్టి. అంతెందుకు గత వారం.. ఆర్జే సూర్య ఎలిమినేట్ అనగానే హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ తోపాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది షాకయ్యారు. టాప్-5లో ఉంటాడనుకున్న అతడు.. సడన్ గా బయటకెళ్లిపోవడం ఏంటని తెగ మాట్లాడుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6, గత సీజన్లతో పోలిస్తే చాలా చప్పగా సాగుతోంది! ఈసారి షో మొదలైనప్పటి నుంచి పెద్దగా బజ్ కూడా ఏం లేదు! దానికి తోడు ఒకరిద్దరు మినహా తెలిసిన ముఖాలు కూడా ఎవరు లేకపోయేసరికి ఈసారి షో చూసేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు కనిపించింది! ఇక స్టార్టింగ్ నుంచి రేవంత్, గీతూ మాత్రమే కాస్తలో కాస్త ఎంటర్ టైన్ ఇస్తూ వచ్చారు. ఇక మిగిలిన వారు అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. అందులో పెద్దగా ఎవరు కూడా ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేకపోయారు. అయితే హౌసులోకి రావడమే పక్కా ప్లానింగ్ తో వచ్చిన గీతూ.. దాదాపు 7 వారాల పాటు అలానే ఆడుతూ వచ్చింది.
ప్రతి గేమ్ విషయంలో ‘మనల్ని ఎవడ్రా ఆపేది?’ అనే రేంజ్ లో ఆడింది. సహా కంటెస్టెంట్స్ నుంచి విమర్శలు వచ్చాయి కానీ బిగ్ బాస్ మాత్రం కిక్కుమనలేదు. గత వారం మాత్రం నాగార్జున ఫుల్ క్లాస్ పీకాడు. బొచ్చులో ఆట ఆడుతున్నావని డైరెక్ట్ గానే తిట్టేశాడు. దీనికి తోడు అన్ని తెలుసనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా గీతూలో పెరిగినట్లు కనిపించింది. దీంతో ఈ వారం ఆమెకి మూడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ లో 10 మంది ఉన్నారు. అందులో ఫైమా, మెరీనా, గీతూ మాత్రం తక్కువ ఓటింగ్ తో ఉన్నారు. ఇదిలా ఉండగా గత వారం ఆర్జే సూర్యని బయటకు పంపించిన బిగ్ బాస్.. ఈసారి ఏకంగా గీతూకే టెండర్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకి పంపిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత? ఏం జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.
If #Geethu gets eliminated, one of the main reasons for her fall down is Nagarjuna (not blaming him)
Nagarjuna bashing #Geetu seems created a huge negative impact among audience – not just her antics. Nagarjuna’s hosting is a huge game changer! #biggbosstelugu6 https://t.co/opu4WagquK— Nag J (@Nag_J1) November 5, 2022