బిగ్ బాస్ 6వ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేషన్. తొలివారం ఎలాగోలా బతికిపోయారు. రెండోవారం మాత్రం వెళ్లిపోక తప్పలేదు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో షానీ సాల్మన్ శనివారం, అభినయ శ్రీ ఆదివారం హౌస్ నుంచి బయటకొచ్చేశారు. వీరిద్దరూ ఎలిమినేట్ అయిపోతారని నెటిజన్స్ కరెక్ట్ గా ఊహించారు. అదే జరిగింది కూడా. కాకపోతే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్. సాధారణంగా ఎవరైనా హౌస్ నుంచి బయటకొచ్చిన మీడియాతో మితంగానే మాట్లాడుతారు. కానీ అభినయ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అభినయ శ్రీ అంటే ప్రస్తుత టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి తెలియదు. ఎందుకంటే 20ల్లో వచ్చిన ఆర్య, చందమామ తదితర సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ షోతో రీఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఆదిలోనే అది ఫెయిలైంది. దీంతో అభియన బరస్ట్ అయిపోయింది. తనకు ఈ షో వల్ల బ్యాడే జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఏమేం అయిందో కూడా రివీల్ చేసింది.
రోజుకు రూ.40 వేలు, అంటే ఇప్పటివరకు రూ.5 లక్షలు ఇచ్చారట కదా అని అభినయని ఓ మీడియా పర్సన్ అడగ్గా.. అలాంటిదేం లేదని చెప్పేసింది. ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారని అడగ్గా.. గీతూ, రేవంత్ ప్రతివారం నామినేషన్స్ లో ఉంటున్నారని, వాళ్లు సేవ్ కూడా అవుతున్నారని చెప్పింది. బహుశా వీరిద్దరిలో ఎవరో ఒకరు విజేత కావొచ్చని అభిప్రాయపడింది. ఇకపోతే తన విషయంలో జరిగింది మాత్రం కరెక్ట్ కాదని ఈమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘బిగ్ బాస్ లో ఉన్నానని ప్రేక్షకులకు చూపిస్తేనే కదా తెలిసేది. అమ్మ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా.. తొలి ఎపిసోడ్ నుంచి నన్ను సరిగా చూపించలేదని చెప్పారు. ఇందులో గుడ్, బ్యాడ్ ఏముంది.. నిజం చెప్పాలంటే నాకు బ్యాడే జరిగింది. రీఎంట్రీ అనే పెద్దకలతో వచ్చాను. ఆ కల నెరవేరలేదు’ అని అభినయ తన అసంతృప్తి బయటపెట్టింది. మరి అభినయ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: నవ్వుతూ మాట్లాడితే బిగ్ బాస్ హౌస్‌లో ఉండనివ్వరా..! గొడవలు పడాల్సిందేనా?