బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త సప్పగా, పేలవంగా సాగుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ షో ద్వారా సెలబ్రిటీలు అయిన వాళ్లున్నారు. అలాగే సెలబ్రిటీలుగా వచ్చి.. పేరు పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వారిలో అంత గొప్పవాళ్లు, సెలబ్రిటీలు లేరంటూ ప్రేక్షకులు షోని లైట్ తీసుకున్నారు అంటున్నారు. దానికి తగ్గట్లుగా బిగ్ బాస్ హిస్టరీలోనే లేనంతగా అతి తక్కువ రేటింగ్స్ ఈ సీజన్‌కు లభించాయి. దాంతో అటు బిగ్ బాస్, నాగార్జునానే కాదు.. హౌస్‌లోని సభ్యులు కూడా రూటు మార్చారు. నవ్వుతూ పలకరిస్తే నడవదని గ్రహించినట్లు ఉన్నారు. మనిషి ఎదురు రాగానే కారాలు, మిరియాలు నూరేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది.
అందుకు ఉదాహరణగా.. ఈ వారం నామినేషన్స్ ని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కేకలు వేస్తూ.. ఎదుటివారిని నామినేట్ చేయడం చూశాం. నామినేషన్స్ లో గీతూ రాయల్– చంటి, శ్రీ సత్య- ఇనయా సుల్తానా, ఆదిరెడ్డి- ఇనయా సుల్తానా, సుదీపా- గీతూ ఇలాంటి వాళ్లు కేకలు, అరుపులు, తిట్టుకోవడం, ఛీ పో అంటూ ఛీత్కారాలు.. ఇలా కొట్టుకోవడం తప్ప అన్నీ చేశారు. రెండు వారాల నామినేషన్స్ ఒకెత్తు అయితే మూడోవారం నామినేషన్స్ ప్రోమో.. ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ప్రోమో అంటూ ప్రేక్షుకులు కూడా కితాబు ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొందరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే గొడవలు పడకపోతే ఇంట్లో ఉండనివ్వరా?
అవును ఇప్పుడు చాలా మంది ఈ ప్రశ్నే అడుగుతున్నారు. మీకు మీరులా ఉండాలి, మీ రియాలిటీ ఏంటో తెలిసేలా చేయాలి అని చెప్పే బిగ్ బాస్.. గొడవలు పడమని ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు? నీ హక్కు కోసం నువ్వు పోరాడు అని చెప్పడం మంచిదే. కానీ, నీ హక్కు కోసం నువ్వు కాట్లాడు అనడం ఎంత వరకు కరెక్ట్? బయటకు వచ్చిన షానీ మాట్లాడుతూ నేను స్లో అండ్ స్టెడీ విన్స్ ద రేస్ అనుకున్నాను. అందుకే నిదానంగా ఆడాను. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో వెళ్లిన రోజే గొడవ పడాలి అని ఇప్పుడు అర్థమైంది అంటున్నాడు. గేమ్ ఆడలేదు అంటే ఏంటి అర్థం? హౌస్‌లో నువ్వు శాంతంగా ఉన్నావు, నీకు కోపం ఎందుకు రాలేదు? అనేలా ప్రశ్నించడం కూడా చూశాం. అటు అభినయశ్రీ కూడా మనిషిని చూసిన మొదటిరోజే నేను గొడవల పడలేను అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అలా అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్‌లో గొడవలు పడాల్సిందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.