‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. టికెట్ టూ ఫినాలే కోసం ఇంట్లోని సభ్యులు బాగానే కష్టపడుతున్నారు. ఐస్ క్యూబ్స్ టాస్కు విషయంలో శ్రీరామ్, సిరి గాయపడిన విషయం తెలిసిందే. లాస్ట్ టాస్కులో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ అనగానే ఆల్రెడీ వెళ్లి వచ్చివారు, లేదంటే బయట ఉండే కొందరు సెలబ్రిటీలు తమ సపోర్ట్ ఎవరికో చెప్తూ వారిని బయట నుంచి సపోర్ట్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజన్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి తన సపోర్ట్ తెలియజేసింది. హౌస్ లో ఉన్న ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కు తన సపోర్ట్ ను ప్రకటించింది.
బిగ్ బాస్ లో శ్రీముఖిని సపోర్ట్ చేసిన తమన్నా.. ఆ తర్వాత తాను ఎవరికీ సపోర్ట్ చేయలేదు. కానీ, ఈ సారి ప్రియాంక సింగ్ కు సపోర్ట్ చేయాలంటూ వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ‘ట్రాన్స్ జెండర్ అనగానే బెగ్గింగ్ చేసే వాళ్లు, చీకటి పనులు చేసే వాళ్లే గుర్తొస్తారు. కానీ, మా లాంటి వారిలో ఎంతో తక్కువ మంది ఇలా బయటకు వచ్చి మిగిలిన వారికి రోల్ మోడల్ గా ఉంటున్నాం. బిగ్ బాస్ ఓవరాల్ హిస్టరీలోనే ఒక ట్రాన్స్ జెండర్ ఇంతకాలం హౌస్ లేదు. ప్రియాంక సింగ్ ఆ రికార్డును సృష్టించింది. జబర్దస్త్ ఫేమ్ తో ఎంతో కష్టపడి ఇక్కడి వరకూ వచ్చింది. నేను, కమ్యూనిటీ తప్పకుండా ప్రియాంక సింగ్ కు సపోర్ట్ చేస్తాం. చేయాల్సిన అవసరం కూడా ఉంది’ అంటూ తమన్నా సింహాద్రి చెప్పుకొచ్చింది. తమన్నా సింహాద్రి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.