‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో టాప్-5 కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలే కోసం చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న తరుణంలో బిగ్ బాస్ షాకింగ్ స్టంట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు తక్షణమే తమ ప్రయాణాన్ని ముగించుకుని బయటకు వెళ్లాలని అందరినీ లగేజ్ తెచ్చుకోమన్నారు. ఎవరు అయితే ఇంట్లో ఉండకూడదని మీరు భావిస్తున్నారో వారి పేరును చెప్పండని కోరారు. మానస్, సన్నీ షణ్ముఖ్ పేరు చెప్పగా.. షణ్ముఖ్- సన్నీ పేరు, శ్రీరామ్- సిరి పేరు చెప్పారు.
బిగ్ బాస్ సిరి మీ లగేజ్ తీసుకుని వెంటనే బయటకు వచ్చేయండి అంటూ అనౌన్స్ చేశారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సిరి నేను వెళ్లను అంటూ కూర్చొని ఏడ్చేసింది. కానీ, చివరకు వెళ్లక తప్పలేదు. సిరి తన లగేజ్ తీసుకుని మెయిన్ గేట్ నుంచి వెళ్లిపోయింది. సిరి- షణ్ముఖ్ ఇద్దరూ హగ్ చేసుకుని కన్నీటపర్యంతం అయ్యారు. అయితే ఇది నిజమైన ఎలిమినేషన్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సీజన్ లో ఏమైనా కొత్తగా ప్లాన్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి? సిరి ఎలిమినేట్ అవ్వడం న్యాయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.