‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముంగిపునకు చేరుకుంది. ఇంట్లో కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. మొత్తం 19 మందితో మొదలైన గేమ్ ఇప్పుడు ఆరుగురికి చేరుకుంది. ప్రియాంక సింగ్ ఎలిమినేషన్ తో హౌస్ లో కాస్త భావోద్వేగ పరిస్థితులు కనిపించాయి. అయితే ఇప్పుడు ఇంకా రెండు వారాలే ఉంది కాబట్టి.. అందరూ విన్నర్ ఎవరు అవుతారు అనే దానిపైనే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆటను పరిశీలిస్తే విన్నర్ పై ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఫాలోయింగ్ గురించి పక్కన పెడితే గేమ్, స్ట్రాటజీ పరంగా చూసుకుంటే శ్రీరామచంద్ర పేరు ఎక్కవగా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తరహాలో ఉందంటూ పోలుస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో మానస్- కాజల్- సన్నీ.. సిరి- షణ్ముఖ్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్ కూడా. కానీ, శ్రీరామచంద్ర మాత్రం ఒక్కడే.
ఆ సీజన్ లో కౌశల్ కూడా అదే తరహాలో ఎవ్వరితోనూ ఫ్రెండ్ షిప్, బాండింగ్ పెట్టుకోకుండా తన గేమ్ తాను ఆడుకుంటూ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు శ్రీరామ్ గేమ్ కూడా అదే తరహాలో ఉంది. పైగా మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. శ్రీరామ్ కూడా కౌశల్ లాగానే దాదాపు అన్ని వారాలు నామినేషన్స్ లో ఉంటూ వచ్చాడు. కానీ, తన గేమ్ ను మాత్రం మార్చుకోలేదు. సింగిల్ గానే అందరినీ ఎదుర్కొంటూ వచ్చాడు. ఎక్కడా తన గేమ్ మార్చుకోకుండా రాజీ పడకుండా ఆడుతున్నాడు. అందుకే ఇప్పుడు విన్నర్ అనే మాట రాగానే శ్రీరామ్ పేరు వస్తోంది. ఏదున్నా నిక్కచ్చిగా, ముక్కు సూటిగా చెప్పేయడం. తప్పు చేసిన వారికి నేరుగా ఇది తప్పు అని చెప్పడం శ్రీరామ్ లో ప్రేక్షకులు, ఇంట్లోని సభ్యులకు బాగా నచ్చిన విషయాలు.
శ్రీరామ్ గాయాలతో బెడ్ పై ఉంటే ఇంట్లోని సభ్యులు మొత్తం అతనికి సేవలు చేయడం, అతని బదులు గేమ్ ఆడి గెలిపించడం చూస్తుంటే.. శ్రీరామచంద్ర అజాత శత్రువు అనడంలో సందేహం లేదు. విన్నర్ కు కావాల్సిన అన్ని లక్షణాలు శ్రీరామచంద్రలో చూశాం. అగ్రెషన్, థింకింగ్, స్ట్రాటజీ, ప్లానింగ్ వంటి అన్ని విషయాల్లో అతను ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది అనే టాక్ బాగా వినిపిస్తోంది. అప్పుడు కౌశల్ విన్నర్ అయ్యే వరకు ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు కాస్త ముందునుంచే ఈ కంపారిజన్లు పెట్టుకుని ఈసారి శ్రీరామచంద్ర అవుతాడనే అంచనాకు వస్తున్నారు. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ విన్నర్ ఎవరు అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.