‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ముందు బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు బిగ్ షాకిచ్చాడు. సిరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించి.. ఆమెను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఇంట్లోని సభ్యులు అందరూ ఏమీ అర్థం కాక అలా ఉండిపోయారు. ఇంట్లోకి వచ్చిన అందరు లేడీ కంటెస్టెంట్ల కన్నా సిరి చాలా స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. అందరినీ దాటుకుని టాప్-5కు చేరుకుంది. ఆమె ఇలా ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదంటూ కొందరు భావిస్తున్నారు. మరోవైపు అసలు సిరి ఎలిమినేట్ కావడానికి షణ్ముఖ్ జశ్వంత్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతి కొద్ది ఫ్యాన్ బేస్ తో వచ్చిన సిరి హన్మంత్ కు బిగ్ బాస్ ద్వారా చాలా మంచి ఆదరణ దక్కిందనే చెప్పాలి. కానీ, షణ్ముఖ్ ను నమ్ముకుని సిరి మోసపోయిందనే టాక్ వినిపిస్తోంది. మొదటి నుంచి సిరిని కంట్రోల్ చేస్తూ షణ్ముఖ్ తనని ఫ్రీగా ఉండనివ్వలేదంటూ చెబుతున్నారు. సిరి కూడా ఫుల్ గా షణ్ముఖ్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయి తన గేమ్ ను నెగ్లెట్ చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్ జెస్సీ సైతం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నా అంటూ నీకు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
షణ్ముఖ్ బిగ్ బాస్ విన్నర్ కావాలంటూ సిరి అనుకోవడం అతని కోసం ఆమె గేమ్ ను పట్టించుకోక పోవడం ఇప్పుడు సిరికి పెద్ద డ్రా బ్యాక్ గా చెబుతున్నారు. షణ్ముఖ్ విషయం పక్కన పెడితే సిరితో హౌస్ మేట్స్ కు కూడా పెద్ద గొడవలు లేవు. ఆమె ఒక ఫైటర్ అంటూ పొగుడుతుంటారు. మరోవైపు షణ్ముఖ్ కూడా ఆమెను పర్సనల్ గా ఎంకరేజ్ చేసింది లేదు. నువ్వే విన్ అవ్వాలి అని తనని తాను తక్కువ చేసుకున్న సమయంలో షణ్ముఖ్ లేదు.. నువ్వు కూడా విన్ అవ్వాలి గేమ్ పై కాన్సన్ ట్రేట్ చెయ్యి అనే మాట అనలేక పోవడంతో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. మొత్తానికి సిరి ఎలిమినేషన్ కు షణ్ముఖ్ కారణం అంటూ గట్టిగానే కామెంట్ చేస్తున్నారు. సిరిని ఎలిమినేట్ కావడానికి షణ్ముఖ్ జశ్వంత్ కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.