‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఎందుకంటే ఉన్న ఎనిమిది మందిలో టాప్ 5 కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఆ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అందరూ అదే టాపిక్ పై మాట్లాడుతున్నారు. రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
రవి గత రెండు మూడు వారాలు మినహా దాదాపు 8 వారాలు ఏదో ఒక పరిస్థితిలో నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. తాను మంచి చేద్దామని చూసినా.. అది బ్యాక్ ఫైర్ అయ్యి చాలా సందర్భాల్లో నెగెటివ్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో మాట అని అనలేదని తర్వాత నాగార్జున వీడియో ప్లే చేసి చూపించడం జరిగింది. మరోవైపు ఒట్టు విషయంలోనూ చాలానే రచ్చ జరిగింది. యాంకర్ గా తెచ్చుకున్న పేరు బిగ్ బాస్ హౌస్ లో కాస్త బ్యాడ్ అయ్యిందనే చెప్పాలి. రవిని నిక్ నేమ్స్ పెట్టి ఇంకా బదనాం చేశారు. తర్వాత ఇన్ఫ్లూఎన్సర్ అంటూ అక్కడ పేరు పోగొట్టుకున్నాడు.
హెల్త్ ఇష్యూస్ కానివ్వండి.. ఇంట్లోని మిస్ అవ్వడం కానివ్వండి రవి కాస్త గేమ్ లో వీక్ అయ్యాడు అని అనుకోవచ్చు. భార్య, కుమార్తె వచ్చి కొత్త జోష్ నింపినా.. అది చూపించే అవకాశం లేకుండా పోయింది. ఇంకో మూడు వారాల్లో వచ్చేస్తానమ్మా అని చెప్పి తర్వాత రోజే ఎలిమినేట్ అయ్యాడు అని సోషల్ మీడియాలో చాలా మంది బాధ పడుతున్నారు. అయితే రవి ఎలిమినేషన్ విషయంలో సందేహాలు కూడా లేకపోలేదు. రవి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.