‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో సభ్యులకు భారీ షాక్ తగిలింది. ఎప్పుడూ వారాంతంలో హౌస్ నుంచి ఒకళ్లు ఎలిమినేట్ అవుతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం అలా కాకుండా మోడల్ జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. జెస్సీ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. టాస్కుల పరంగా జెస్సీ ఒక ఫైటర్ అంటూ హౌస్‌లోని సభ్యులు అందరూ ఒప్పుకుంటారు. కానీ, ఇలా అనుకోని ఆరోగ్య సమస్య వల్ల జెస్సీ హౌస్ వీడటం చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. మరీ ముఖ్యంగా షణ్ముఖ్, సిరిలు విపరీతంగా ఏడ్చేశారు. తమ మిత్రుడు ఇల్లు వదిలి వెళ్లిపోవడం చూసి వారి గుండె బద్దలయ్యింది. చిన్న పిల్లల తరహాలో ఏడ్చేశారు. ఇప్పుడు అందరి ప్రశ్న అసలు జెస్సీకి వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? ఎందుకు దానిని క్యూర్ చేయలేకపోయారు? ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
మోడల్ జశ్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ‘వెర్టిగో’ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. వెర్టిగో అంటే తల తిరగడం, లేదా తన చుట్టూ ఉన్న పరిసరాలు తిరుగుతున్నట్లు కనిపిచడం. దీని వల్ల మనిషి తన బ్యాలెన్స్ కోల్పోతాడు. నిటారుగా నించులేడు. కంటిచూపు కూడా బ్లర్ అవుతుంది. ముఖ్యంగా జెస్సీకి కళ్లు తిరగడం, చూపు బ్లర్ అవ్వడం సింటమ్స్ ఉన్నాయి. వైద్యులు చికిత్స చేసినప్పటికి జెస్సీకి క్యూర్ కాలేదు. ముఖ్యంగా హౌస్ పరిస్థితుల వల్ల కూడా అతనికి అలా తగ్గకుండా ఉండచ్చని భావించారు. అందుకే అతని ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇంటికి పంపేశారు. అనుకోని సంఘటన ఎదురుకావడంతో ఇంట్లోని సభ్యులు అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కళ్లు తిగడం, బ్యాలెన్స్ కోల్పోవడం, మగతగా ఉండటం, తల తిరగడం, వాంతులు కావడం, గాల్లో తేలుతున్నట్లు అనిపించడం, కాళ్ల కింద భూమి కదులుతున్న భావన కలగడం వంటివి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు.