‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా వారం రోజులే ఉంది. టాప్-5 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. సీజన్ మొదటి నుంచి చివరి వారం వరకు కూడా ప్రేక్షకులు, ఇంట్లోని సభ్యులు మాట్లాడుకుంటోంది.. సిరి- షణ్ముఖ్ రిలేషన్ మీదే. అది స్నేహం అని కొందరు, స్నేహం హద్దులు దాటిందని మరి కొందరు, ఆ హగ్గులు అవసరమా ఇంకొందరు మాట్లాడుతున్నారు. కొందరు కోపం, ఇంకొందరు చిరాకు, మరికొందరు పరాకులు చూపిస్తున్నారు.
కన్నతల్లి వచ్చి కూడా ఆ హగ్గులు నచ్చట్లేదని అందరూ అనుకునేదే చెప్పింది. ఆ తర్వాత నుంచి దానికొక పేరు పెట్టారు. ఫ్రెండ్ షిప్ హగ్ అని. ఒకరి ప్రవర్తన, క్యారెక్టర్ ను ఎప్పుడూ ఎవరూ జడ్జ్ చేయకూడదు. కానీ, ఒక పని చేస్తే తప్పుగా మాట్లాడుతున్నారు.. ముఖ్యంగా ఒక అమ్మాయి గురించి అన్నప్పుడు అది చేయడం మానేస్తే మంచిదే.
తాజాగా ఎక్స్ హౌస్ మేట్స్ క్వశ్చన్స్ అంటూ కంటెస్టెంట్లకు ఝలక్ ఇచ్చాడు నాగార్జున. ఆ టాస్కులో భాగంగా సిరి- షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండ్ జెస్సీ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షణ్ముఖ్ ను సిరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. మీ రిలేషన్ పై బయట ఎలా మాట్లాడుకుంటున్నారో మీకు అసలు అర్థమవుతోందా అంటూ సూటిగా ప్రశ్నించాడు.
సిరికైతే గట్టిగానే ఇచ్చాడు. నువ్వు గేమ్ ఆడటానికి వెళ్లావు కదా? మరి గేమ్ ఆడకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అంటూ ఏంటిది అంటూ సీరియస్ అయ్యాడు. జెస్సీ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఎక్కడికి వెళ్లినా అతనికి ఎదురయ్యై మొదటి ప్రశ్న సిరి- షణ్ముఖ్ నిజంగానే ఫ్రెండ్సా? వాళ్ల మధ్య ఏమీ లేదా? ఇలాంటి ప్రశ్నలు విన్న జెస్సీకి విసుగొచ్చి తన బాధను ఇలా వ్యక్త పరిచాడు. ఇప్పటికైనా వీరి గేమ్ ప్లేలో మార్పు వస్తుందా? ప్రవర్తన మారుతుందా? చూడాలి. ఆఖరికి జెస్సీ కూడా వీరి రిలేషన్ పై ఫైర్ కావడంతో ఇప్పుడు ఇది హాటాపిక్ అయ్యింది. సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.