‘బిగ్ బాస్ 5 తెలుగు’ షోకి గత మూడ్రోజులుగా మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. ఈ సీజన్‌లో పెద్దగా తెలియని వారు, యూట్యూబ్ ఫేమ్ స్టార్లనే తెచ్చినా.. బాగానే ట్విస్టులతో నెట్టుకొచ్చారు. కానీ, ప్రేక్షకులు వాటిని ఇట్టే పట్టేస్తున్నారు. వాటిని ముందే అంచనా వేస్తున్నారు అనే టాక్ బాగా వినిపిస్తోంది. అందుకు మంచి ఉదాహరణ లోబో సీక్రెట్ రూమ్ టాస్కే అని చెప్తున్నారు. ఎలిమినేషన్ పరంగానూ ఇంట్లోని వాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో కేవలం ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతున్నారు అనగానే.. నటరాజ్ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశారు. మళ్లీ మామూలే అంటూ ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏసర్ ఇండియాపై సైబర్ ఎటాక్? 50 జీబీ యూజర్ డేటా చోరీ చేసినట్లు హ్యాకర్ల ప్రకటన!
అందరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పంపి ఈ హౌస్‌కి ఎవరు మిస్ ఫిట్ అంటూ ఒక పేరు కోరగా లోబోకి 4 ఓట్లు, నటి ప్రియకి 4 ఓట్లు వచ్చాయి. టై అయ్యిందని నేరుగా ఒక సైడ్ తీసుకోవాలని కోరగా ఎక్కువ మంది యానీ మాస్టర్ సైడ్ తీసుకున్నారు. వెంటనే లోబో యు ఆర్ మిస్ ఫిట్ ఫర్ ది హౌస్ అంటూ నాగార్జున అనౌన్స్ చేశాడు. పెట్టేబేడా సర్దుకుని వచ్చేస్తాడు. లోబోతో నాగార్జున కాసేపు మాట్లాడి బాయ్ కూడా చెప్తాడు. అలా వెళ్తున్నప్పుడు లోబో కమ్ బ్యాక్ అంటూ వెనక్కి పిలిచి ఇలా నువ్వు సీక్రెట్ రూమ్‌కి వెళ్తున్నావు అంటూ చెప్పుకొస్తాడు.
ఏదో సీక్రెట్ టాస్కులో భాగంగానే ఇలా చేస్తున్నారంటూ ప్రేక్షకులు ముందే కనిపెట్టేశారు. అసలు లోబో అంత ఈజీగా ఎందుకు ఎలిమినేట్ అవుతాడు అన్నది వచ్చిన ప్రశ్న. కచ్చితంగా ఇది పెద్ద స్కెచ్ అనే అనుకున్నారు. చివరికి అలాగే జరిగే సరికి ఈసారి మాత్రం ప్రేక్షకులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా బిగ్‌బాస్ ఎంగేజింగా టాస్కులు చేయట్లేదంటూ టాక్ మొదలు పెట్టారు. ఈ టాస్కుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.