‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఈ సీజన్ బాగా ఎంటర్‌టైనింగ్‌గా, వివాదాలు, సెన్సార్ కట్లు అబ్బో ఒకటేమిటి వివిధ కోణాలు, వింత చేష్టలతో ప్రేక్షకులకు మంచి వినోదమే అందుతోంది. ఈ సీజన్‌లో అంతా బానే ఉంది కానీ, బాగా వినిపిస్తున్న మాట హౌస్‌లో సగం మందికి పైగానే ముక్కు, మొఖం తెలియని వాళ్లు ఉన్నారు అని బాగా వినిపిస్తున్న మాట. మరి అలా అనుకుని ఊరుకోరు కదా గూగుల్ తల్లిని అడగటం మొదలెట్టారు. అలా తవ్వకాల్లో ఈ చిన్నారి ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆమె ఎవరు అని అందరికీ అనుమానం వస్తోంది.
సరే, క్వశ్చన్‌కు ఒక హింట్ ఇస్తాము. ఆమె ఇప్పుడు హౌస్‌లో ఫైర్ బ్రాండ్. ఒక్కసారిగా హౌస్‌లో ఆగ్రహంతో చెలరేగిపోయింది. ఈమె అసలు హౌస్‌లో ఉందా? మొదటివారం అసలు కనిపించిందా? అని అడుగుతున్న వారికి బాగా గట్టింగా సమాధానం ఇచ్చింది. నామినేషన్ రోజు హౌస్ మేట్స్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అందరూ ఈమె ఇంతలా అబ్జర్వ్ చేస్తోందా? ఏమీ పట్టనట్లు ఉందిగా అనుకున్న వారికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. సోమవారం మొత్తం ప్రేక్షకుల నోట ఆమె పేరే వినిపించింది.
అవును మీరు అనుకున్నది కరెక్టే ఆ చిన్నారి ఎవరో కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న శ్వేత వర్మ. రెండోవారం మొదటిరోజు శ్వేత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క ప్రోమో చూసి ఎపిసోడ్ కోసం ఎదురుచూసిన వారు ఎందరో. యానీ మాస్టర్‌ను ఉమ తప్పుగా మాట్లాడిందంటూ కోపం తట్టుకోలేక బాగా అరిచేసింది శ్వేత. మరోవైపు లోబో, హమీదాకు కూడా బాగానే క్లాస్ పీకింది. ఏదేమైనా.. ప్రేక్షకులకు మాత్రం మంచి డ్రామా, కన్నీటి పర్యంతం ఎపిసోడ్, రగిలే అగ్నిపర్వతం లాంటి ఎన్నో అంశాలను ఒక్క ఎపిసోడ్‌లో శ్వేత ఇచ్చిపడేసింది.
‘బిగ్ బాస్ 5 తెలుగు’కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూడండి.