‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఆట రసవత్తరంగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు ఆడుతున్నారు. ఆట దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా టాప్ 5 ఎవరో తెలియాలంటే ఇంకొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా టికెట్ ఫినాలే కోసం ప్రస్తుతం బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇచ్చాడు. అందులో నెగ్గి ఇప్పుడు ఒకళ్లు తొలి ఫైనలిస్ట్ గా నిలిచారు. అతనే మన సంగీతం మాస్టారు సింగర్ శ్రీరామచంద్ర. చివరి టాస్కులో మానస్ పై విజయం సాధించి టికెట్ టూ ఫినాలే గెలుచుకున్నాడు.
శ్రీరామ చంద్ర- మానస్ కు కూర్చొని ఆడే టాస్క్ ఇచ్చారు. ఒక టవర్ కు ప్లాస్టో పారిస్ చక్కలు పెట్టి వాటిపై బరువును ఉంచారు. దానిని లాగి పైనుంచి వదిలి ఆ చక్కలు పగలగొట్టాలి. అందులో శ్రీరామచంద్ర విజయం సాధించాడు. అయితే మానస్ కు మాత్రం అదృష్టం కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే పైనుంచి పడే చక్కలు అడ్డుగా ఉండి మానస్ కు చాలాసేపు టాస్కు సాగలేదు. ఎంత ప్రయత్నించినా ఆ చక్కలు అడ్డుగా వచ్చి విజయం సాధించలేక పోయాడు.
శ్రీరామచంద్రకు అదృష్టం, బలం అన్ని సహకరించడంతో గెలుపొందాడు. కాళ్లకు గాయాలున్నా కూడా చాలా చక్కగా పర్ఫార్మ్ చేశాడు. అంతకు ముందు టాస్కుల్లో సన్నీ, షణ్ముఖ్ శ్రీరామ్ బదులు ఆడి అతడిని గెలిపించారు. ఆ విధంగా శ్రీరామచంద్రకు టికెట్ టూ ఫినాలే దొరికింది. శ్రీరామచంద్ర పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.