తెలుగు ఇండియన్ ఐడల్ కు మంచి ఆదరణ లభిస్తోంది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఒక్కో వారం ఒక్కో స్పెషల్ థీమ్ ఉంటుంది. గతవారం ఎస్పీబీ సాంగ్స్ తీసుకోగా.. ఈ వారం రెట్రో స్పషల్ గా ప్లాన్ చేశారు. ఈ వారం స్పెషల్ గెస్ట్ గా విశ్వక్ సేన్ హాజరయ్యాడు. రెట్రో స్పెషల్ థీమ్ కు తగ్గట్లుగా కంటెస్టెంట్లు కూడా పాతకాలం నాటి కాస్టూమ్స్ తో అలరించారు.
ఇదీ చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?
ఇంక విశ్వక్ సేన్ అయితే సింగర్ లాలసతో కలిసి మాస్ స్టెప్పులేశాడు. ఆ తర్వాత తన డాన్స్ కు డడ్జిమెంట్ కూడా కోరాడు. అందుకు తమన్ పైకి లేచాడు క్లాప్స్ కొట్టాడు. తమన్ రియాక్షన్ చూసి.. విశ్వక్ మోకాళ్ల మీద కూర్చుని అభివాదం చేశాడు. కాసేపు విశ్వక్ సేన్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు. తర్వాత న్యాయనిర్ణేతగా ఉన్న నిత్యామేనన్ తో కాసేపు మాట కలిపాడు. ‘నిత్యామేనన్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని. అలా వైకుంఠపురంలో నుంచి మొన్నటి భీమ్లానాయక్ వరకు’ అంటూ మాట్లాడుతుండగా.. నిత్యా కలగజేసుకుని అది అలా మొదలైంది అని చెబుతుంది. అంతే విశ్వక్ కు గాలి తీసినట్లైంది.
విశ్వక్ వెంటనే తేరుకుని.. ఇప్పుడు న్ను ఏసుకుంటారు కదా అని శ్రీరామచంద్రను అడుగుతాడు. ‘అలా మొదలైంది.. అలా వైకుఠంపురంలో అలా ఉందికదా, ఇలా కన్ఫ్యూస్ అయ్యాను’ అంటూ విశ్వక్ సేన్ ఎలానో కవర్ చేశాడు. ఇంక సింగర్ జయంత్ కు బిర్యానీ అంటే ఇష్టమని తెలుసుకున్న విశ్వక్.. అతని కోసం ఇంటి నుంచి క్యారియర్ లో బిర్యానీ తీసుకొచ్చాడు. విశ్వక్ సినిమాల విషయానికి వస్తే.. తన అశోకవనంలో అర్జన కల్యాణం సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు చేసిన మాస్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా మంచి అరిటాకు భోజనంలా ఉంటుంది, సకుటుంబ సపరివారి సమేతంగా వెళ్లి చూడచ్చని హామీ ఇచ్చాడు. విశ్వక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.