‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఈ వారం హౌస్‌లో మంచి ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కెప్టేన్సీ పోటీదారు టాస్కులో గుడ్ల కోసం చాలానే తిప్పలు పడ్డారు ఇంట్లోని సభ్యులు. దొంగతనాలు, కుస్తీలు కూడా బాగానే జరిగాయి. నా గుడ్లు పోయాయంటూ నానా యాగి చేశారు సభ్యులు. ఎట్టకేలకు టాస్కు ముగియగానే ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేసిన ఐదుగురు సభ్యులు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. సన్నీ, మానస్, విశ్వ, రవి, సింగర్ శ్రీరామచంద్ర పోటీదారులు అయ్యారు. సీక్రెట్ టాస్క్‌లో విఫలమవ్వడం వల్ల జెస్సీకి అవకాశం దక్కలేదు. లోబో ఎంట్రీతో మరో ట్విస్టు వచ్చింది. శ్రీరామ్‌ను కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించి తనకున్న శక్తితో కాజల్‌కు ఆ అవకాశం దక్కేలా చేశాడు లోబో.
ఇదీ చదవండి: మానస్‌కు మూడుసార్లు బ్రేకప్ అయ్యింది.. అందుకేనా ప్రియాంకను దూరం పెడుతున్నాడు?
ఈ వారం ఆ ఐదుగురిలో ఒకరు కెప్టెన్ కావాలి. చెరపకురా చెడేవు అన్న సామెత అందరికీ తెలుసు. దాని అర్థం కూడా బాగా తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంట్లో ప్రియకు ఎదురైంది. ఆమె ఎలాగైనా సన్నీ కెప్టెన్ కాకూడదు అని కోరుకుంది. దానికి తగిన గేమ్ కూడా బాగానే ఆడింది. అతడిని ఎంతగానో రెచ్చగొట్టింది. కానీ, చివరకు ఆ టాస్కులో సన్నీనే విజేతగా నిలిచాడు. సన్నీ ఈ వారం హౌస్‌లో కెప్టెన్‌గా గెలిచాడు. ఆమె సన్నీని ఎంతగా టార్గెట్ చేసింది అంటే ప్రేక్షకులు కూడా ఎందుకు ఇలా చేస్తోంది అంటూ విసుగుతెచ్చుకునే స్థాయికి చేరింది ఆమె ప్రవర్తన. చివరకు సన్నీ కెప్టెన్ కాగానే ప్రియ నోట మాటలేదు.
సన్నీ కెప్టెన్ కావడమే ప్రియకు మింగుడు పడటం లేదంటే. ఆమెకు ఇంకో షాక్ తగిలింది. సన్నీ తన రివేంజ్ తీర్చుకున్నాడు అనే తెలుస్తోంది. సన్నీ కెప్టెన్ కాగానే రేషన్ మేనేజర్‌ను ఎంచుకువాల్సి ఉంటుంది. అందుకు ప్రియకు ఎవరైతే ఇష్టం లేదో వారినే సన్నీ రేషన్ మేనేజర్ చేస్తాడు అని అందరికీ తెలుసు. అదే జరిగేలా ఉంది కూడా. రేషన్ మేనేజర్‌గా సన్నీ కాజల్‌ను ఎంచుకుంటాడు అని తెలుస్తోంది. దాదాపు అదే జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సన్నీకి హెల్ప్ చేస్తుందనే కారణంతో ప్రియ కాజల్‌ను కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. సన్నీ కూడా అదే కారణంతో కాజల్‌ను రేషన్ మేనేజర్ చేసి ఉండచ్చు.
సన్నీ కెప్టెన్ కావడం వల్ల హౌస్‌లో ప్రియపై రివేంజ్ తీర్చుకునే అవకాశం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.