తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోని 12 ఎపిసోడ్ లో డే 11 హౌస్ కెప్టెన్సీ కోసం రెండు టీమ్ సభ్యులు హోరాహోరి పోరు పోరాడారు. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు.
మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, అన్నీ, ప్రియాంక, ప్రియ ఉన్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం మీద ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో ఆహ్లాదకరంగా సాగిపోతూ కనిపించింది. విశ్వ కెప్టెన్ అయ్యాక ఉమా- లోబో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించు కుంటూ ముద్దులుపెట్టుకుంటూ ఉన్నట్లు కూడా కనిపించారు. ఉమా, లోబో ఎదురెదురుగా కూర్చొని తెగ ప్రేమించుకోవడం మొదలు పెట్టేశారు. వీరిద్దరి చూసిన అనీ మాస్టర్ ఇదెక్కడి లవ్ ట్రాక్. చాలా కొత్తగా ఉందని చెప్పింది.
ఆ తర్వాత అక్కడికి వచ్చిన రవి… మీది యాక్టింగ్ అని తెలిసిపోతుంది, కొంచెం మంచిగా నటించండి అని చెప్పాడు. అయితే సింగిల్ బెడ్ కోసం ఉమ ,లోబోకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్లకు ఆ బెడ్ సొంతమని చెప్పాడు. ఈ క్రమంలో ప్రియాంక సాయం తీసుకున్న లోబో బాగా నవ్వించాడు. ఉమా, సిరి చేసిన స్కిట్ కంటే లోబో, ప్రియాంక చేసిన స్కిట్ పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. ఇక ఈ టాస్క్ లో లోబో విజేతగా నిలిచి.. సింగిల్ బెడ్ దక్కించుకున్నాడు. ఇది నా పొట్టికి (ఉమాదేవి) ఇచ్చేస్తున్నా అని అందరి ముందు చెప్పాడు. ఆమెకు నుదుటి మీద తెగ ముద్దులు కూడా ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో కొత్త కొత్త లవ్ ట్రాక్స్ తో సందడి మొదలైందని అంటున్నారు.