బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్ సిరి హనుమంత్. అదే బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదుర్కొంది. బిగ్ బాస్ ముగిసిన చాలా రోజుల తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇటీవలే వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ డామేజ్ తో సిరి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ తగ్గించేసింది. అయితే.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తోంది.
తాజాగా సిరి పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నువ్వు కాల్ చేస్తే.. నేను కట్ చేసే పొజిషన్ నుండి, నేను కాల్ చేస్తే నీకు బిజీ వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడే అర్ధమైంది. నువ్వు దేన్నో గోకుతున్నావని. ఎనీవే నేను నీకు దొరకడం నీ అదృష్టం.. నువ్వు ఇంకోదాన్ని తగులుకోవడం నా అదృష్టం. నీకు సిగ్గులేదు దానికి బుద్దిలేదు’ అంటూ చేసిన ఇంస్టా రీల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సిరి అలా వీడియో పోస్ట్ చేసిందో లేదో.. బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా కామెంట్లతో రెచ్చిపోయారు. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా కరెక్ట్ డైలాగ్ సెలెక్ట్ చేసుకున్నావ్.. అంటూ కొందరు షణ్ముఖ్ ని ట్యాగ్ చేస్తున్నారు. మరికొందరు జెస్సీని ఇంకా వదలలేదా..? బిగ్ బాస్ హౌజ్ లో ఎలాగో మీ మధ్య నలిగిపోయాడు అంటున్నారు. ఓవైపు షణ్ముఖ్ ని లాగిన నెటిజన్లు.. నెమ్మదిగా దీప్తి సునైనాని కూడా లాగడం గమనార్హం. మరి వారిద్దరూ ఈ వీడియో పై రియాక్ట్ అవుతారా.. లేదా? అని సందేహపడుతున్నారు. మరి సిరి వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.