ఫైవ్ స్టార్ హోటల్స్ లో భోజనం చేయాలని ప్రతి సామాన్యూడు అనుకుంటారు. దీనికి తోడు వాటిల్లో భోజనం చేయాలంటే అందంగా ముస్తాబు కావాలి. హుందాగా నడుచుకోవాలి. కాస్ట్లీ హోటల్ కాబట్టి బిల్లును కార్డుల్లో చెల్లించాలి. కానీ ఓ యువకుడు వినూత్నంగా బిల్లు చెల్లించి సదరు హోటల్ అవాక్కైయేలా చేశాడు.
లగ్జరీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒక్కసారైనా ఆహారం తినాలని మధ్య తరగతి మనుషులకు కోరిక ఉంటుంది. అయితే ఆ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఒక్క రోజు ఫుడ్‌కు అయ్యే బిల్లు ఖర్చు మొత్తం అదే మధ్యతరగతి కుటుంబం నెల రోజుల పాటు తమ ఇంటి సరుకులకు కేటాయించవచ్చు. అందుకే సామాన్యుడు బయట నుండి ఫైవ్ స్టార్ హోటల్స్ చూసి మురిసిపోతుంటారు. దీనికి తోడు వాటిల్లో భోజనం చేయాలంటే అందంగా ముస్తాబు కావాలి. హుందాగా నడుచుకోవాలి. కాస్ట్లీ హోటల్ కాబట్టి బిల్లును కార్డుల్లో చెల్లించాలి. కానీ ఓ యువకుడు వినూత్నంగా బిల్లు చెల్లించి సదరు హోటల్ అవాక్కైయేలా చేశాడు.
వివరాల్లోకి వెళితే ముంబయి కుర్రాడు సిద్దేశ్ లోకరే తాజాగా నగరంలోని అతిపెద్ద తాజ్ హోటల్ ( 26/11 ఉగ్రవాదుల దాడితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది)కు వెళ్లాడు. అక్కడ తనకు ఇష్టమైన ఆహారాన్నితిన్నాడు. అయితే బిల్లు దగ్గరకు వచ్చేసరికి చిల్లరతో చెల్లించాడు. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముందుగా తనకు ఆకలిగా ఉందని చెప్పిన యువకుడు డబ్బులు లేకుండా తినాలని అనుకున్నాడు. అయితే సమీపంలో అతి పెద్ద ఫైవ్ స్టార్ హోల్ తాజ్‌లో తింటానని, తన వద్ద ఉన్న చిల్లరతో బిల్లును చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి వరకు క్యాజువల్స్ ఉన్న సిద్దేశ్.. సూటు వేసుకుని, స్టైల్ మార్చి హోటల్‌కు వెళ్లాడు.
అక్కడకు వెళ్లి మెనూ కార్డులో చూడగా రగడ పూరీ ఖరీదు రూ. 800లు చూపిస్తుంది. అయితే షాక్ తిన్న అతగాడు ఓ మామూలు ఫిజ్జా, మాక్ టైల్ ఆర్డర్ చేశాడు. వాటిని తిన్నాక.. బిల్లు తీసుకు రాగా ముందుగా నోట్లు తీసినట్లు తీసిన సిద్దేశ్, తన వద్దనున్న చిల్లరను ఒక్కొక్కటిగా లెక్కవేయడం మొదలు పెట్టాడు. ఇది చూసిన మిగిలిన కస్టమర్స్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. బిల్లును ఇలా చెల్లిస్తున్నానని చెప్పి వెయిటర్‌కి ఇవ్వగా.. ఆయన నవ్వుకుంటూ లెక్కిస్తానంటూ చిల్లర తీసుకుని వంటగదిలోకి వెళ్లిపోయాడు. అనంతరం అతడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న అది డాలరా, చిల్లరా అని చూడకండి.. లావాదేవీలు ముఖ్యం ఫ్రెండ్స్ అంటూ రాసుకొచ్చాడీ యువకుడు. చిల్లరతో ఫైవ్ స్టార్ హోటల్ బిల్లు చెల్లించిన ఈ వీడియో నవ్వులు తెప్పిస్తుంది. మీకేమీ అనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.