యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, జోష్, టిక్ టాక్ వంటి వాటిల్లో వీడియోలు చాలా మంది ఫేమస్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్ లేదా ఒక్క రీల్, ఒక్క షాట్‌తో రాత్రికి రాత్రే స్టార్ రేంజ్ హోదాకు వెళ్లిపోతున్నారు. అక్కడ ఫేమస్ కాకపోతే.. రియాలిటీ షోల ద్వారా పేరు తెచ్చకుంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న బాలిక కూడా ఆ కోవకు వర్తిస్తుంది.
సోషల్ మీడియా వచ్చాక సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, జోష్, టిక్ టాక్ వంటి వాటిల్లో వీడియోలు చేసి ఫేమస్ అవుతున్నారు. షార్ట్ ఫిల్మ్ లేదా ఒక్క రీల్, ఒక్క షాట్‌తో రాత్రికి రాత్రే స్టార్ రేంజ్ హోదాకు వెళ్లిపోతున్నారు. అటువంటి జాబితా తెలుగు సినిమా పరిశ్రమలో కొదవ లేదు. ఆ తర్వాత బుల్లితెర, వెండి తెరపై వెలుగొందుతున్నారు. వీటిల్లో పేరు రాకపోతే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల్లో పాల్గొని పేరు తెచ్చుకుంటున్నారు. లేదంటే కాంట్రవర్సీల్లో చిక్కుకుని.. అందరీ చూపు వారి వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే నటి ఈ కోవ కిందకు వస్తుంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బాలికను గుర్తుపట్టారా. చిన్న హెయిర్‌తో చిరు మంద హాసాన్ని ఒలికిస్తున్న ఈమె ఎవరో తెలుసా.? క్లూ చెప్పమంటారా..? ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ స్టార్. ప్రస్తుతం బిజీ ఆర్టిస్టు కూడా. అంతేకాదూ రియాలిటీ షోలో సందడి చేసి.. విమర్శలు కూడగట్టుకుంది. ఆమె సిరి హనుమంతు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన సిరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాల్లోకి వెళితే.. నటనలోకి రాకముందు అందాల పోటీలో పాల్గొని ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ టైటిల్‌ను అందుకుంది. 2014లో యోన్ అనే టివీలో న్యూస్ ప్రజెంటర్‌గా చేరింది. 99 టీవీ, టీ న్యూస్ వంటి చానల్స్‌లో కూడా పనిచేశారు. తర్వాత పొట్టి సినిమాల్లో నటించి మెప్పించింది. మరుపు రాని ప్రేమకథ, ఫోర్ డేస్ విత్ శ్రీ, లవ్ అండ్ డౌట్ వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించింది. ఆమె లవర్ శ్రీహాన్‌తో గందరగోళం, మేడమ్ సర్ మేడమ్ అంతే. రామ్ లీలా వంటి సిరీస్‌లో కూడా నటించింది.
అవే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆమె బిగ్ బాస్‌లోకి వచ్చాక చాలా మందికి తెలిసింది. అందులో తోటి కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె మామూలు రచ్చ చేయలేదు. అయితే అప్పటికే వారిద్దరూ కలిసి ఇన్ఫిటమ్ మీడియాలో పలు సిరీస్‌లు చేశారు. అప్పటికే షన్ను.. మరో యూట్యూబర్ దీప్తి సునయన ప్రేమలో ఉంటే.. సిరి-శ్రీహాన్‌ను ప్రేమిస్తుంది. అయితే బిగ్ బాస్‌లో స్నేహితుల ముసుగులో వీరు చేసిన విన్యాసాలు.. చూసేవారు సైతం మండిపడ్డారు. చివరకు షన్ను-దీప్తి ప్రేమకు బ్రేకప్ చెప్పుకునేందుకు దారి తీసింది. అటు శ్రీహన్ కూడా పట్టించుకోకపోవడంతో ఒంటరై మానసికంగా కుంగిపోయింది.
ఆ తర్వాత శ్రీహాన్ అర్థం చేసుకుని ఆమెకు చేరువయ్యాడు. ఇప్పుడు మా మధ్య అపార్థాలకు తావు లేదని ఓ సారి సిరి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ నుండి వచ్చాక ఆమెకు వరుసగా ఆఫర్లు కడుతున్నాయి. ఆహాలో బిఎఫ్ఎఫ్ అనే చిత్రంలో నటించింది. తర్వాత లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ నటించిన ఓటీటీ సినిమా పులి-మేకలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా థియేటర్లలో సందడి చేయకపోయినా.. ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. హే సిరి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇన్‌స్టాలో కూడా సందడి చేస్తుంటుంది. తన చిన్న నాటి ఫోటోను షేర్ చేసింది సిరి. ఆ ఫోటో వైరల్ గా మారుతోంది.