‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలేకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ నానా తిప్పలు పడుతున్నారు. అయితే టాప్ 5లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చెప్పడం చాలా కష్టమే. అందుకే ఓటింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ ఓటింగ్ విషయంలోనూ ఉత్కంఠ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ఆదివారం రాత్రి నుంచే మొదలు కాగా.. మూడో రోజు మాత్రం లెక్కలు మారాయని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
హౌస్ లో అడుగుపెట్టిన అమ్మాయిల్లో స్ట్రాంగ్ లేడీ సిరి మాత్రమే టాప్-5లోకి అడుగుపెట్టింది. ఓటింగ్ పరంగా సిరికి అంత సపోర్ట్ వస్తున్నట్లు లేదని టాక్ వినిపిస్తోంది. సిరి ఐదో స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి కామ్ అండ్ కంపోస్డ్ గా ఉన్న మానస్ మాత్రం నాలుగో స్థానానికి ఫిక్స్ అయిపోయాడు అంటున్నారు. మన లోన్ రేంజర్ అగ్రెసివ్, స్ట్రాటజీస్ తో ప్రేక్షకుల్లో మంచి ఆదరణే పొందాడు. సింగర్ శ్రీరామచంద్ర మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మొదటి రెండు రోజులు సన్నీనే ఓటింగ్ లో టాప్ లో ఉన్నట్లు సమాచారం. కానీ, మూడో రోజు ఆ లెక్కలు మారాయంటున్నారు. సన్నీకి ఓటింగ్ తగ్గడమే కాదు.. షణ్ముఖ్ కు ఓటింగ్ పెరింగిందనే టాక్ చక్కర్లు కొడుతోంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. హాట్ స్టార్ యాప్ లో సన్నీ టాప్ లో ఉండగా.. ఫోన్ లైన్ ఓటింగ్ లో షణ్ముఖ్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారిక లెక్కలు ప్రకారం టైటిల్ విన్నర్ విషయంలో ఉత్కంఠ నెలకొనేట్లుగానే కనిపిస్తోంది. ఇదే ధోరణి కంటిన్యూ అయితే బిగ్ బాస్ యాజమాన్యానికి తలపోటు తప్పదేమో? బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.