బిగ్‌బాస్ 5 తెలుగు లో ఫైనల్‌కి చేరుతున్న సమయంలో ఇంటి సభ్యులు ఒకరినొకరు టార్గెట్ చేస్తూ ఆట రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం `టికెట్ టు ఫినాలే` టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఐస్ క్యూబ్‌పై నిల్చొని తమకి కేటాయించిన బంతులను కాపాడుకుంటూ, ఇతరుల బంతులను లాక్కోవాల్సి ఉంటుంది. ఇందులో గెలుపొందిన వాళ్లు డైరెక్ట్ గా ఫైనల్‌కి క్వాలిఫై అవుతారు. ఈ టాస్క్ లో సిరి, శ్రీరామ్, సన్నీల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ముందుగా సన్నీ..సిరి వద్ద బంతులు తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ఐస్‌లో కాలు పెట్టినట్టు చెప్పింది. దీంతో ఒక బంతి తీసుకున్నాడు సన్నీ. ఆ తర్వాత సన్నీ బంతులపై సిరి ఎటాక్ చేసింది. దీంతో సన్నీ బంతుల బకెట్ కింద పడిపోయింది. గేమ్ మధ్యలో సిరి తన బాల్స్ లాక్కోవడంతో సన్నీ ఫైర్ అయ్యాడు.
ఇప్పుడు ఆడతా నేను అంటూ తన గేమ్ మొదలుపెట్టాడు. సిరి దగ్గర బాల్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండంతో.. ఆమె ఐస్ టబ్ లో నుంచి బయటకు రాకుండా అలానే ఉండిపోయింది. నేను గివప్ చేయను.. రవి ఐ మిస్ యూ అంటూ గట్టిగా అరిచింది. పెర్సనల్ గ్రడ్జ్ తో ఎందుకు గేమ్ ఆడతావ్ అని సన్నీని ప్రశ్నించింది. అదే అందరికీ తెలుసు ఎవరు పెర్సనల్ గేమ్ అన్నది.. ప్రతీ గేమ్ లో నువ్ పెట్టుకుంటావ్ నాతో గొడవ.. అలా ఆడేది నువ్వు నేను కాదు.. అని అన్నాడు సన్నీ. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో సిరికి శ్రీరామ్ సపోర్ట్ చేశాడు. నా బాల్స్ తీసుకో అని అన్నాడు. దాంతో శ్రీరామ్ పై కూడా ఫైర్ అయ్యాడు సన్నీ. మరోపక్క సిరి ఎక్కువసేపు ఐస్ టబ్ లో ఉండిపోవడంతో ఆమె కాలి స్పర్శపోయి ఏడ్చేసింది.
ఐస్ బకెట్‌లో నుంచి కాళ్లు తీయకుండా అలాగే నిల్చుండిపోయిన సిరికి కాళ్లు పట్టేసుకున్నాయి. దీంతో గేమ్ ముగియగానే మానస్ ఆమెకు సాయం అందించాడు. డాక్టర్ల సహకారంతో వాళ్లకి ట్రీట్‌మెంట్ చేశారు బిగ్‌బాస్. అయితే దీనంతటికీ సన్నీ కారణమన్నట్లుగా షణ్ముఖ్ చూడడంతో సన్నీకి మరింత కోపమొచ్చింది. అసలు ఏం రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు.. ఇంకా ఎంత బ్లేమ్ చేస్తారు నన్ను అంటూ కాజల్ దగ్గర ఫీలైయ్యాడు సన్నీ.
నువ్ తప్పు ఆడలేదు. కావాలని ఎక్కువసేపు ఐస్ టబ్ లో ఉంది సిరి. వాళ్ల గేమ్ వాళ్లు ఆడుకుంటున్నారు అని సన్నీకి నచ్చజెప్పింది. గేమ్ లో రవి అని అంటున్నారు.. రవిని నామినేట్ చేసింది వాళ్లే.. ఇన్ఫ్లుయెన్సర్, మానిప్యులేటర్ అని ట్యాగ్స్ ఇచ్చింది వాళ్లే.. ఈరోజేమో ఇలా చేస్తున్నారు.. నిజంగా మైండ్ గేమ్ తో ఆడుతున్నాడని మానస్ అన్నాడు.
ఒక అడుగు కూడా వేయలేకపోతున్న కంటెస్టెంట్ల బాధలు చూసి సన్నీ ఏడ్చేశాడు. శ్రీరామ్ కాళ్లు కూడా బాగా హర్ట్ అవ్వడంతో డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ అందించారు. తనవల్లే సిరి, శ్రీరామ్ హర్ట్ అయ్యారని భావించిన సన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు సన్నీ. బిగ్ బాస్ శ్రీరామ్ పాడిన ‘గెలుపు తలుపులే’ సాంగ్ ప్లే చేయగా.. శ్రీరామ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు.