‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న షాకులు, ట్విస్టులు మాములుగా ఉండటం లేదు. నామినేషన్స్ లో డిఫరెంట్ గా గేమ్ ప్లాన్ చేసి ఆడుకున్న బిగ్ బాస్ జెస్సీ విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఒకే సీజన్ లో రెండో కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ కి పంపి బిగ్ బాస్ భారీ షాకే ఇచ్చాడు. జెస్సీ ఆరోగ్యం సరిగా లేనందున ఇంటికి పంపేస్తున్నట్లు ఇంట్లోని సభ్యులను, ప్రేక్షకులను సైతం నమ్మించిన బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో సీక్రెట్ రూమ్ లో జెస్సీని పెట్టి ట్విస్ట్ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ రూమ్ లో ఉండే వ్యక్తి అందరికీ లేని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంట్లోని సభ్యులు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలను చూస్తూ ఉండచ్చు. ఆ తర్వాత తన గేమ్ ఎలా ఉండాలి? ఎలా ఆడితే అక్కడ నెగ్గుకు రాగలరు అనే విషయాలు ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. సన్నీ అత్యంత తక్కువ అంచనాలతో హౌస్ లోకి వచ్చి.. ఇన్ని రోజులు ఉండగలిగాడంటే అందరూ ఆశ్యర్యపోతున్నారు. జెస్సీ ఫైటింగ్ స్పిరిట్ అంటే ఇంట్లోని సభ్యులకు కూడా ఎంతో ఇష్టం. ఒక ఫైటర్ గానే తన స్థానాన్ని ఇంట్లో పదిలం చేసుకున్నాడు. ఒక్కసారి పంపేస్తున్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనైనా వస్తాడని భావించారు. కానీ అలా ఏం కాకుండా జెస్సీని సీక్రెట్ రూమ్ పంపాడు బిగ్ బాస్. అలా వెళ్లాడో లేదో.. వీజే సన్నీ జెస్సీ గురించి మాట్లాడిన మాటలు చూసి షాక్ అయ్యాడు. నేను వచ్చాక నా గేమ్ ఏంటో చూపిస్తానంటూ జెస్సీ కామెంట్ చేశాడు.