‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం అటు రవికే కాదు.. ఇంట్లోని సభ్యులు, ఇప్పటికే ఇంటి నుంచి బయటకు వచ్చిన సభ్యులకు కూడా షాక్ గానే ఉంది. ముఖ్యంగా రవి అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు అందరూ ఎంతో షాక్ లో ఉన్నారు. రవి ఎలిమినేషన్ ఫేక్ అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేకాదు రవిని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రవి అభిమానులు హెచ్చరిస్తున్నారు.
ఆదివారం రవి అభిమానులు అందరూ అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసన వ్యక్తం చేశారు. రవి ఎలిమినేట్ అయ్యాడని వార్తులు రావడం మొదలైనప్పటి నుంచి అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాజల్, సిరి, ప్రియాంక కంటే రవికి తక్కువ వోట్లు వచ్చాయని రవిని ఎలిమినేట్ చేశారు. ‘రవికి లీస్ట్ ఓట్లు వచ్చాయంటున్నారు. ఆ ఓటింగ్ ప్రూవ్స్ మాకు చూపించండి’ అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రవిని తిరిగి హౌస్ లోకి పంపకపోతే సోషల్ మీడియాలో రిపోర్ట్స్ కొడతామంటూ హెచ్చరిస్తున్నారు.
యాంకర్ రవి ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చిన మాట వాస్తవమే. అప్పటి వరకు ప్రియాంక అనుకుంటే ఆమె ముందే సేవ్ అయ్యింది. కాజల్ ను చివరి వరకూ తీసుకొచ్చారు. కానీ, చివర్లో రవిని ఎలిమినేట్ చేశారు. బహుశా అభిమానుల నుంచి ఈ రకం స్పందన యాజమాన్యం ఊహించి ఉండరు. ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చిన సభ్యులు సైతం రవి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ స్పందించారు.
బిగ్ బాస్ కు యాంకర్ రవి అభిమానులతో పెద్ద తలనొప్పే వచ్చి పడింది. ఇదే తరహా వ్యతిరేకత కొనసాగితే యాంకర్ రవిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపక తప్పదేమో? అనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటి ప్లాన్ తోనే రవిని బయటకు పంపారా? అని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా యాంకర్ రవి ఎలిమినేషన్ బిగ్ బాస్ కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. యాంకర్ రవి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.