పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సెట్ లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది గోరేగావ్ లోని ఫిల్మ్ సిటీలో గల బిగ్ బాస్ సెట్ కి నాలుగు ఫైర్ ఇంజన్లతో వచ్చి భారీ ప్రమాదాన్ని తప్పించారు. ముంబైలోని బృహన్ మున్సిపల్ కోఆపరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అంతేకాకుండా అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం అటు రవికే కాదు.. ఇంట్లోని సభ్యులు, ఇప్పటికే ఇంటి నుంచి బయటకు వచ్చిన సభ్యులకు కూడా షాక్ గానే ఉంది. ముఖ్యంగా రవి అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు అందరూ ఎంతో షాక్ లో ఉన్నారు. రవి ఎలిమినేషన్ ఫేక్ అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేకాదు రవిని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని […]
తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కరోనా నేపథ్యంలో కొంతకాలం వాయిదా పడ్డ ఈ రియాలిటీ షో ఎట్టకేలకు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ లో రానున్న కంటెస్టెంట్స్ ఎవరెవరా అని అంతా ఆతృతగా ఎదురుచూశారు. మొత్తం 19 కంటెస్టెంట్స్ ను పరిచయం చేస్తూ షోలోకి ఆహ్వానించారు హోస్ట్ కింగ్ నాగార్జున. ఇక అనుకున్న అంచనాలకు ఏ మాత్రంగా తగ్గకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమైంది బిగ్ బాస్-5. […]