తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కరోనా నేపథ్యంలో కొంతకాలం వాయిదా పడ్డ ఈ రియాలిటీ షో ఎట్టకేలకు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ లో రానున్న కంటెస్టెంట్స్ ఎవరెవరా అని అంతా ఆతృతగా ఎదురుచూశారు. మొత్తం 19 కంటెస్టెంట్స్ ను పరిచయం చేస్తూ షోలోకి ఆహ్వానించారు హోస్ట్ కింగ్ నాగార్జున.
ఇక అనుకున్న అంచనాలకు ఏ మాత్రంగా తగ్గకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమైంది బిగ్ బాస్-5. దీంతో ప్రేక్షకులకు కోరిన వినోదాన్ని అందిస్తూ బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక విషయం ఏంటంటే..? బిగ్ బాస్ ను ఇష్టపడే వాళ్లు ఎంత మంది ఉన్నారో..అందుకు తగ్గట్టు వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారని చెప్పక తప్పదు. తాజాగా ప్రారంభమైన సీజన్-5పై కొంతమంది నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
బిగ్ బాస్ వల్ల దేశానికి, జనాలకు ఎలాంటి ప్రయోజనం లేదని గొంతెత్తి అరుస్తున్నారు. దేశంలో ఎంతోమంది రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకే రోడ్డున పడుతున్నారని, దేశానికి అన్నం పెట్టే రైతులపై ఆలోచించకుండా ఇదేందంటూ కొందరు తెలియజేస్తున్నారు. దీంతోపాటు బిగ్ బాస్ వల్ల హిందుభావాలను కించపరచటమే కాకుండా, మనోభావాలను దెబ్బతీసేలా షో ఉందంటూ కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. షో ప్రారంభమైందో లేదో అప్పుడే తమదైన శైలీలో నెటిజన్స్ బిగ్ బాస్ పై దుమ్మెత్తిపోస్తూ తమ ఆవేదనను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక నెటిజన్స్ చేస్తున్న ఇలాంటి కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.