పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సెట్ లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది గోరేగావ్ లోని ఫిల్మ్ సిటీలో గల బిగ్ బాస్ సెట్ కి నాలుగు ఫైర్ ఇంజన్లతో వచ్చి భారీ ప్రమాదాన్ని తప్పించారు. ముంబైలోని బృహన్ మున్సిపల్ కోఆపరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అంతేకాకుండా అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఇది లెవల్ 1 ప్రమాదం అంటూ అధికారులు పేర్కొన్నారు.
ఇక బిగ్ బాస్ రియాలిటీ షో.. నిస్సందేహంగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంట్రవర్సీ రియాలిటీ షోలలో ఒకటి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన షో భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటుంది. ఇటీవలే హిందీలో బిగ్ బాస్ 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాలుగు నెలల పాటు కొనసాగిన ఈ వినోదాత్మక సీజన్ వవ ఏడాది జనవరి 30న ముగిసింది. BB 15 ట్రోఫీని సీరియల్ నటి తేజస్వి ప్రకాష్ సొంతం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ గత 5 సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బిగ్ బాస్ ఓటిటి సీజన్ మొదలు కాబోతుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్న కొత్త సీజన్ కోసం ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక ఫైనల్ అవుతోందని సమాచారం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ 24 గంటలపాటు ప్రేక్షకులను అలరించనుంది. మరి బిగ్ బాస్ షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.