‘బిగ్ బాస్ 5 తెలుగు’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ సక్సెఫుల్‌గా నడుస్తోంది. గతవారం మొత్తం గొడవలు, సవాళ్లు, బీప్లతో సాగిన షో తాజ ఎపిసోడ్ చాలా కూల్‌గా, రొమాంటిక్‌గా సాగింది. పంతం నీదా నాదా టాస్క్‌లోని ఆఖరి టాస్కులో టీమ్ ఈగల్స్ నెగ్గటంతో ఓవరాల్ ఛాంపియన్‌గా టీమ్ ఈగల్స్ అవతరించింది. ఈగల్స్ టీమ్ నుంచి నలుగురు సభ్యులను కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకోవాల్సిందిగా బిగ్ బాస్ చూసిస్తాడు. మేము ముందుగానే చెప్పినట్లుగా ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ టాస్కులో హౌస్ మేట్స్‌లో ఎక్కువ మంది విశ్వ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. హాట్ హాట్ హౌస్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ టచ్‌తో మొత్తం మూడ్‌ని మార్చేశారు. శ్వేత బర్త్‌డే కావడంతో బిగ్ బాస్ సర్ప్రైజింగ్గా అందరికీ చాక్లెట్స్ పంపుతాడు.
మరోవైపు షణ్ముఖ్, యాంకర్ రవి, హమీదా ట్రాక్ బాగా పండింది. హమీదా ఎదుట షణ్ణుని బుక్ చేసే ప్రయత్నం చేశాడు యాంకర్ రవి. హౌస్‌లో ఉన్న అందరి అమ్మాయ్యిల్లో హమీదా హాట్‌గా ఉటుంది, స్మార్ట్‌గా ఉంటుందని చెప్పావుగా అంటాడు. అందుకు షణ్ముఖ్ అరె ఏంట్రా ఇది? అన్నట్లు ముఖం పెట్టి ఏంటి సార్ నన్ను బుక్ చేయాలని ప్లాన్ చేసుకునే వచ్చారు కదా? అంటూ నవ్వుతుంటాడు. హమీదా ఎస్-డీ మధ్యలో హెచ్ రాయాలంటూ సూచిస్తుంది. లేదా ఇంకో పిల్లో పెట్టండి దానిపై ‘ఎస్’, ‘హెచ్’ రాయాల్సిందిగా చెప్తుంది ఏంటి మరో ట్రాక్ రాబోతోందా? అనుకునేలోపే దానిపై బెస్ట్ ఫ్రెండ్స్ అని రాయాలంటూ చెప్తుంది. షణ్ముఖ్ కూడా హమ్మయ్యా అనుకున్నాడు. లహరి, రవి మధ్యలు దీప్తీ చూస్తున్నావా? అంటూ అంటూ ఉంటారు.
కిచెన్‌లో అర్ధరాత్రి అంట్లు తోముతూ మానస్ ఉంటాడు. అక్కడికి లహరి వచ్చి మానస్‌కు హెల్ప్ చేస్తుంది. ఇద్దరిని గమనిస్తున్న శ్రీరామ్ వారిదగ్గరకూ రాగానే మానస్ అతడ్ని ఉడికించే ప్రయత్నం చేస్తాడు. ఏంటి పడుకుంటున్నావా లహరి అని. ఓకే గుడ్‌నైట్ అంటూ లహరికి హగ్ ఇవ్వగానే శ్రీరామ్ వెళ్లిపోతాడు. మానస్‌ని బెడ్ వరకు రావాల్సిందిగా కోరిన లహరి అక్కడికి వెళ్లాక గట్టిగా హగ్ చేసుకుని కాసేపు బిగించేసింది. ఇదంతా శ్రీరామ్‌ని ఆట పట్టించడానికా? లేదా వీరిమధ్య ఏమైనా కనెక్ట్ కాబోతోందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. తెలుసుగా బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో చూస్తుండాలి మరి.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.