బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. అందరి అంచనాలని, ఆశలని నిజం చేస్తూ VJ సన్నీ విజేతగా నిలిచాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్ మాత్రం రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. షన్ను ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా సిరి విషయంలో షన్నుని దోషిగా నిలబెట్టి, ఓట్లు పడకుండా చేశారంటూ సన్నీ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఈ వార్ సంగతి పక్కన పెడితే.. ఫైనల్ లో హోస్ట్ నాగార్జున చూపించిన ఓ తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
సన్నీ ప్రైజ్‌మనీ కోటి పైనే.. కానీ చేతికొచ్చేది ఎంతంటే..?
ఓడినా.. సన్నీ కన్నా ఎక్కువే గెలుచుకున్న షణ్ముఖ్ జశ్వంత్!
బిగ్ బాస్ అనగానే తెలుగులో అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది హోస్ట్ నాగార్జున మాత్రమే. నాగ్.. గత కొన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ షోని ఎంత అద్భుతంగా ముందుకి నడిపిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. నాగార్జునని తప్ప ఇంకెవ్వరిని ఆ షోకి హోస్ట్ గా ఇప్పుడు ప్రేక్షుకులు ఉహించుకోలేరు. అయితే.., ఇంత బాగా షోని హోస్ట్ చేసిన నాగార్జున కూడా గత సీజన్స్ గ్రాండ్ ఫినాలేలో ఓ చిన్న పొరపాటు చేశారు.
బిగ్ బాస్ మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్… శ్రీముఖి చేతులు పట్టుకుని టైటిల్ విన్నర్ ని అనౌన్స్ చేశారు నాగ్. కానీ. ఆ సమయంలో శ్రీముఖి చేతిని నాగార్జున ఒక్కసారిగా కిందకు వదలగానే ఆమె షాక్ అయ్యింది. ఆ సమయంలో హోస్ట్ నాగార్జున నాగార్జున కొంత దూకుడు చూపించారన్న కామెంట్స్ వినిపించాయి.
#RahulSipligunjBB3Winner from #BiggBossTelugu3
Winning videos for the benefit of #RahulSipligunj chichaa fans. (1/n) pic.twitter.com/uYWwX6RM8X
— TV series observer (@Bigg4Boss) November 3, 2019
ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా నాగార్జున విన్నర్ ని ప్రకటించిన తీరు ఇలానే సాగింది. ఆ సమయంలో అఖిల్ చేతిని విసురుగా కిందకు విసిరేశారు నాగ్. ఆ సమయంలో.. అఖిల్ ఎక్స్‌ప్రెషన్ చూసిన అందరికి పాపం అనిపించింది. ఇలా ప్రతిసారి నాగ్ విన్నర్ ని అనౌన్స్ చేసే సమయంలో కాస్త ఉద్వేగానికి లోనవుతూ వచ్చారు. నిజానికి ఈ విషయంలో ఆయన్ని కూడా తప్పు పట్టలేము. 100 రోజుల జర్నీలో హోస్ట్ గా చేసే నాగార్జునకి కూడా ఫినాలే అంటే ఆ మాత్రం ఎమోషన్ ఉండక మానదు. కానీ.., ఓడిపోయిన వారిని అలా తీసి పక్కన పెట్టేసినట్టు వ్యవహరించడమే ఇన్ని ఎపిసోడ్స్ కాస్త ఇబ్బందిగా ఉంటూ వచ్చింది.
కానీ.., ఈసారి నాగార్జున లెక్క మారింది. ఈసారి చేయి విసిరికొట్టడాన్ని పూర్తిగా మానేశాడు. సన్నీ, షన్నూ ఇద్దరి చేతులను పైకెత్తినప్పుడు.. షన్నూ చేతిని అలా గాల్లోనే వదిలేశాడు. దీంతో.. షన్నూకు విషయం అర్థమై చప్పట్లు కొట్టాడు. సో.. ఈసారి సింపుల్ గా విన్నర్ ఎవరో తేల్చారు నాగార్జున. దీంతో.. ఇప్పుడు కింగ్ నాగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతి సీజన్ లో కూడా ఇంతే సున్నితంగా విన్నర్ ని ప్రకటించాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Machaaaaaaaaaaaa! You have done it🤩🤩🤩🤩🤩🤩 congratulations 🎉🥳🥳🥳🥳 #VJSunny #BiggBossTelugu5 pic.twitter.com/idudbX9CuA
— #̷7̷F̷o̷r̷e̷v̷e̷r̷ (@Novembre07) December 19, 2021