‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. కొందరు ఇదేం షో అని తిడుతున్నా.. ఎక్కువ మందిని బాగా అలరిస్తోంది. హౌస్‌లో ఈ సీజన్ జరిగినంత రచ్చ మరెప్పుడు జరగలేదంటూ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ‘పంతం నీదా నాదా’ టాస్క్ పుణ్యమా అని ఉమ – యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్ – వీజే సన్నీ, శ్వేత – సిరి, ప్రియ – వీజే సన్నీ ఇలా ఎన్నో యుద్ధాలను చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సెలబ్రిటీలు అంటే పైనుంచి దిగొచ్చినట్లు ఉండరు కోపమొస్తే మనలాగానే మాట్లాడతారు అన్న విషయం బాగా గ్రహించారు. ఆ విషయంలో బిగ్ బాస్ కాన్సెప్ట్ సక్సెస్ అయినట్లే. ఇక వారి బాహాబాహీ చూడలేక బిగ్ బాస్ చివరికి ఆ టాస్క్‌కి మంగళంపాడి విజేతలుగా టీమ్ ఈగల్స్‌ని ప్రకటించేశారు. కెప్టెన్‌ని ఎంచుకునే అవకాశం ఇంట్లోని సభ్యులకే అప్పగించారు. టీమ్ ఈగల్స్ నుంచి నలుగురు సభ్యులను ఉంచి వారి నుంచి ఎంచుకోవాల్సిందిగా తెలిపారు.
ఎప్పుడూ చిత్ర విచిత్ర టాస్కులిచ్చే బిగ్ బాస్ ఈసారి కూడా కెప్టెన్‌ని ఎంచుకునేందుకు మరో ట్రికీ టాస్క్‌ను పెట్టాడు. తమకు నచ్చిన కెప్టెన్‌ని ఎంచుకునేందుకు సభ్యులు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను గ్లాసులో పట్టి.. వారికి నచ్చిన వ్యక్తి ఎదుట ఉంచిన పొడవాటి గ్లాస్‌లో పోయాలి. ఎవరికి సంబంధించిన గ్లాస్ త్వరగా నిండుతుందో వారే కెప్టెన్‌గా నిలుస్తారు. సభ్యులందరూ ఇక కొబ్బరికాయలు తీసుకుని ఆ నీళ్ల కోసం ఎలా కొట్టుకున్నారంటే అబ్బో అది చూస్తేనే అర్థమవుతుంది. మినీ యుద్ధమే జరిగింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులతో మినిమం ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని మళ్లీ రుజువైంది. టీమ్ ఈగల్స్ నుంచి కెప్టెన్సీ రేసులో విశ్వ, హమీదా, ప్రియాంక సింగ్, యానీ మాస్టరు ఉన్నారు.
ఇక, ఇంటి సభ్యులు కిందామీద పడి కొబ్బరినీళ్ల కోసం కొట్టుకుని.. ఒకరి నీళ్లు ఒకళ్లు లాక్కొని, మీద పోసుకుని నానా రచ్చ చేశారు. ఇక అందరి కంటే ముందు విశ్వకు చెందిన గ్లాస్ నిడటంతో ‘బిగ్ బాస్ 5 తెలుగు’ రెండో కెప్టెన్‌గా విశ్వ నిలిచాడు. పంతం నీదా నాదా, సాగరా సోదరా, దొంగలున్నారు జాగ్రత్త టాస్కుల పుణ్యమా అని మొదలైన వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. శనివారం, ఆదివారం నాగార్జునకు గట్టి పనే చెప్పారు ఇంట్లోని సభ్యులు. చూద్దాం మరి కింగ్ నాగార్జున ఎలా వారికి పాఠాలు చెప్తారో. ఎవరిని గద్దిస్తాడో, ఎవరిని బుజ్జగిస్తాడో చూడాలి.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, ఎలిమినేషన్, గాసిప్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ను చూస్తుండండి.