బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గేమ్ సందతి పక్కన పెడితే ట్రోలింగ్, నెగెటివిటీతో బాగా వైరల్ అవుతోంది. ఈ సీజన్లో ఆరో వారం పూర్తి కావస్తోంది. కొత్త కెప్టెన్ కోసం బిగ్ బాస్ హోటల్ వర్సెస్ హోటల్ టాస్కు ఇచ్చిన విషయంతెలిసిందే. ఆ టాస్కు ద్వారా ఎంపికైనా వారికి రెండో టాస్కు ఇచ్చాడు. ఇంట్లో ఒక బాక్సింగ్ గ్లౌజ్ పెట్టి మీకు నచ్చని వారిని టాస్కు నుంచి తప్పించండి అంటూ ఆర్డర్ వేశాడు. ఆ టాస్కులో చివరికి కీర్తీ భట్, శ్రీ సత్య, సుదీపా పింకీలు మిగిలారు. వాళ్ల ముగ్గురికి బ్లాక్ బస్టర్ కెప్టెన్ అంటూ మరో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్కులో అద్భుతంగా ప్రదర్శన చేసి కీర్తీ భట్ బిగ్ బాస్ హౌస్ నాలుగో కెప్టెన్‌గా అవతరించింది. కీర్తీ భట్ అసలు కెప్టెన్ అవుతుందని ఆమె కూడా నమ్మి ఉండకపోవచ్చు.
ఎందుకంటే ప్రస్తుతం హౌస్‌లో కీర్తీ భట్ ఎంతో డల్‌గా ఉంటోంది. ఎందుకంటే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లలో రెండుసార్లు నాగార్జున సోఫా వెనుక నిల్చోబెట్టి మీరు అసలు గేమ్ ఆడటం లేదంటూ కీర్తీ భట్‌కి కూడా రెండు సార్లు క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఆమె గేమ్ తగ్గిపోయింది. అంతేకాకుండా బిగ్‌బాస్ ఇచ్చిన టైమ్ టాస్కులో ఆమెకు అంతా జీరో మినిట్స్ అని ఇవ్వడంతో ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టాస్కులు, హౌస్‌మేట్స్ గేమ్‌తో కీర్తీ భట్ ఎంతో డల్‌గా ఉంటూ వచ్చింది. మొదటి నుంచి ఆమె కెప్టెన్సీ కోసం ఎంతో ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాలేదు. చివరకి కీర్తీ భట్ గెలిచి చూపించింది. ఇంట్లో ఎన్నో పనులు చేస్తున్నా తనని ఎవరూ గుర్తించడం లేదంటూ కీర్తీ ఎంతో ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
హౌస్ మేట్స్ లో చాలా మంది కీర్తీ భట్ ఈ హౌస్‌కి కరెక్ట్ కాదేమో? ఎమోషన్స్, సింపథీతో నెట్టుకు రావాలని చూస్తోందంటూ కూడా కామెంట్స్ చేశారు. కానీ, కీర్తీ భట్ మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో గేమ్ ఆడుతూ ముందుకు వచ్చింది. లాస్ట్ వారంలో అయితే రాజ్ కి కీర్తీ భట్ మీద ఏదో ఉంది అంటూ చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో కీర్తీ పేరు వైరల్ కావడానికి ఎంతో హెల్ప్ చేసింది. ఇప్పుడు కెప్టెన్ కూడా కావడంతో ఆమెకు కలిసొచ్చినట్లు అయ్యింది. అసలు ఈ వారమే ఇంటి నుంచి వెళ్లిపోతానేమో అని భయపడిన కీర్తీ ఇప్పుడు కెప్టెన్ అయ్యింది. మరోవైపు రాజ్ ఎలిమినేట్ అవుతున్నాడు అనే వార్తలతో కీర్తీ భట్‌కి హౌస్‌లో ఇంకో రెండు వారాలు ఉండేందుకు అవకాశం దొరికిందనే చెప్పాలి. మొత్తానికి వేస్ట్ అన్న ఇంటి సభ్యులతో కీర్తీ బెస్ట్ అనిపించుకుంది.