బిగ్ బాస్ అంటే గొడవలు, కొట్టుకోవడాలు, రొమాన్స్.. ఇలాంటివే కాదు అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సందర్భాలు కూడా వస్తుంటాయి. ఈసారి బిగ్ బాస్ లో అలాంటివి పెద్దగా ఏం కనిపించలేదు. షో మొదలైన కొత్తలో హౌస్ మేట్స్.. తమ జీవితంలో ఎదురైన అనుభవాలు చెప్పారు. ఆ సమయంలో కాస్త ఇలాంటి పరిస్థితి ఏర్పడింది తప్పితే.. ఎమోషనల్ చేసే పరిస్థితులు మాత్రం రాలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా హౌస్ మేట్స్ తోపాటు చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా కన్నీరు పెట్టుకునేలా చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ ప్రస్తుతం అంతంత మాత్రంగానే సాగుతోంది. రేవంత్, గీతూ తప్పించి మిగతా వాళ్లు మంచో చెడో అస్సలు గేమ్ అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆరోహి-సూర్య కూడా లవ్ ట్రాక్ ని డెవలప్ చేస్తున్నప్పటికీ.. అది క్లిక్ అవడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. మరోవైపు శ్రీసత్య-అర్జున్ కూడా తెగ కష్టపడుతున్నారు. కానీ వర్కౌట్ కావడం లేదు. మిగతా వాళ్లు కూడా సో సో గానే ఫెర్ఫామ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కన్నీళ్లు పెట్టించే ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సింగర్ రేవంత్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వితని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సీమంతం వేడుక జరిగింది. హౌసులో ఉన్న రేవంత్.. బయటకెళ్లడం కుదరదు కాబట్టి.. బిగ్ బాస్ ఆ వేడుకకు సంబంధించిన వీడియోని హౌసులోని టీవీలో ప్లే చేశారు. రేవంత్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన భార్య సీమంతం ఫంక్షన్ లో తాను లేకపోవడం, చాలారోజుల తర్వాత ఆమెని చూసేసరికి రేవంత్, కన్నీళ్లని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్న భార్యకు ముద్దుపెడుతూ, హౌసు నుంచే అక్షతలు వేశాడు. ఇది జరిగిన తర్వాత హౌసులోని వాళ్లని కౌగిలించుకుని ఏడ్చేశాడు. మరి రేవంత్ ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.