బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో హౌస్ మొత్తం యుద్ధభూమిలా మారిపోయింది. ఎవరికి వారు గెలిచేందుకు పక్క వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. గీతూ అయితే మొత్తం అందరి ఆట కట్టించేందుకు శ్రాయశక్తుల ప్రయత్నాలు చేసింది. అక్కడికి ఐదుగురు సభ్యులను డిస్కాలిఫై అయ్యేలా చేసింది. ఆమెను ఆట తప్పించేందుకు చాలా కష్టాలే పడ్డారు. చివరకు ఎలాగోలా రేవంత్ ఆమె ఆట ఆగిపోయేలా చేశాడు. ఆ తర్వాత మళ్లీ హౌస్ మొత్తం కలిసి గీతూని డిస్కాలిఫై చేసేందుకు చాలా కష్టపడ్డారు. అయితే గీతూ ఒక్కతే రేవంత్, శ్రీసత్య, అభినయశ్రీ, శ్రీహాన్‌లను డిస్కాలిఫై చేసింది. అయితే వీళ్లందరి విషయాలు పక్కన పెడితే రేవంత్ విషయంలో మాత్రం ప్రేక్షకులు కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఎందుకంటే రేవంత్ భార్య అన్విత ప్రెగ్నెంట్ అని తెలిసిందే. స్టేజ్ పై కూడా రేవంత్ భార్య విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడు. హౌస్‌లో ఈ సిసింద్రీ టాస్క్ ఇచ్చి ఒక బొమ్మను తమ బిడ్డగా ట్రీట్ చేయాలని చెప్పడంతో రేవంత్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. అయితే శాక్ అండ్ షేప్ టాస్క్ తర్వాత బాగా అలిసిపోయి రేవంత్ ఆ బొమ్మను పక్కన పెడతాడు. కాస్త బ్రీత్ తీసుకున్న తర్వాత తీసుకుందాం అనుకుంటాడు. అప్పుడు రేవంత్ బొమ్మ కీర్తీ భట్ పట్టుకోగా ఆమె వద్ద నుంచి గీతూ రాయల్ తీసుకుని లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేస్తుంది. అంటే అక్కడితో రేవంత్ ఆట ముగిసిపోయింది. నిజానికి ఆట విషయం పక్కన పెడితే ఆ బొమ్మ దూరమైనందుకు రేవంత్ ఎంతో బాధ పడ్డాడు.
తర్వాత మరీనా- రోహిత్ లతో కూడా తన బాధ ఏంటో చెప్పుకున్నాడు. గేమ్ పోయిందని కాదు.. రాత్రి ఆ బొమ్మను పట్టుకుని పడుకుందాం అని అనుకున్నాను అంటూ రేవంత్ ఏడ్చేశాడు. అది చూసి మరీనా ఏడవకంటూ సర్దిచెప్పింది. రోహిత్ సైతం రేవంత్‌ను ఏడవకంటూ చెప్తాడు. ఇంకో మూడు నెలలలో నీకు బిడ్డ పుట్టబోతోంది కదా ఎందుకు బాధ పడతావ్ అంటూ ఓదార్చారు. ఆ తర్వాత స్టోర్ రూమ్‌లో బొమ్మ పెట్టేందుకు వెళ్లినప్పుడు కూడా రేవంత్ ఎంతో ఎమోషనల్ గా బొమ్మ అక్కడ పెట్టి ఫీలవుతాడు. అయినా ఇంకో 3 నెలలో నాకు ఒక బేబీ రాబోతోంది తనను ఎత్తుకుంటాలే అంటూ వెళ్లిపోతాడు. రేవంత్ ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.