బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో హౌస్ మొత్తం హుషారుగా, హడావుడిగా మారింది. తామే గెలిచి పోటీదారులు అయ్యేందుకు ఆ తర్వాత కెప్టెన్ అయ్యేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గీతూ రాయల్ మాత్రం నానా గలాటా చేసే ఇంట్లోని సభ్యులను ముప్పతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు అంతా కలిసి గీతూని ఓడించారు. ఆమెను టాస్కులో లేకుండా డిస్కాలిఫై చేశారు. కానీ, ఆమె మాత్రం ఒక్కతే ఇంట్లో వాళ్లందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఈ హౌస్‌లో అడుగు పెట్టిన వారిలో ఫైమాని అంతా తక్కువ అంచనా వేశారు. సభ్యులు సైతం ఆమెను ఫన్నీగానే చూశారు. కానీ, సరైన సమయంలో సరైన స్ట్రాటజీతో ఫైమా తానేంటో నిరూపించుకుంది.
సిసింద్రీ టాస్కులో మొదట ట్రామ్‌లో బొమ్మలు పెట్టిన ఐదుగురు సభ్యులు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తారు. అయితే ట్రామ్‌లో మొదటి రౌండ్‌లో గీతూ, రేవంత్, ఫైమా, చంటి, ఆరోహి పెట్టారు. వారిని తర్వాతి రౌండ్ సాక్ అండ్ షేప్‌కు పంపారు. ఆ గేమ్‌లో ఒక గోనె సంచిలో కాళ్లు పెట్టి గెంతుతూ ఒక ఎండ్‌లో ఉన్న షేప్‌లను తీసుకుని మరో ఎండ్‌లో ఉన్న బోర్డులో పెట్టాలి. అలా పెట్టిన తర్వాత గంట కొడితే విజయం సాధిస్తారు. ఈ రౌండ్‌లో చలాకీ చంటి విజయం సాధించి, మొదటి కంటెండర్ అయ్యాడు. నిజానికి రేవంత్ గెలవాల్సింది. కానీ, ఫైమా చేసిన పని వల్ల రేవంత్ ఓడిపోయాడు. ఒక్క షేప్ దొరక్కా రేవంత్ అలాగే ఉండిపోయాడు. ఫైమా గేమ్ స్ట్రాటజీ రేవంత్‌ని కోలుకోలేని దెబ్బ కొట్టింది.
అసలు ఏమమైందంటే.. అలా షేప్స్ తీసుకుని వెళ్లి పెట్టాలి. ఫైమా తనకు కావాల్సిన షేప్ అనుకుని ఒకటి తీసుకెళ్లి తన బోర్డులో పెట్టింది. కానీ, అది ఆమెకు సెట్ అయ్యేది కాదు. దానిని తిరిగి తీసుకెళ్లి తెచ్చిన చోట పడేస్తే వేరేవాళ్లు తీసుకెళ్లి పెట్టుకుంటారు. రేవంత్‌కు కావాల్సిన ఆ ఒక్క షేప్‌ను తిరిగి తీసుకురాకుండా ఫైమా అక్కడే ఉంచింది. తీసుకురామని బతిమిలాడినా కూడా ఆమె తీసుకురాలేదు. చివర్లో ఇది నా గేమ్ స్ట్రాటజీ అంటూ షాకిచ్చింది. అయినా నువ్వు గెలవాలి అనుకుంటే నేను ఎందుకు అన్నా గేమ్ ఆడటం అంటూ ఫైమా చెప్పిన మాటకు రేవంత్ అవాక్కయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ మాట్లాడుకుని పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. తర్వాత ఫైమాకు రేవంత్ హెల్ప్ కూడా చేశాడు. కానీ, అది కౌంట్‌లోకి రాలేదు. ఎందుకంటే ఈ గ్యాప్‌లో రేవంత్- గీతూ వల్ల డిస్కాలిఫై అయ్యాడు. ఫైమా గేమ్ స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపోలో తెలియజేయండి.