బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గొడవలు, విమర్శలతో ఎంతో హుషారుగా సాగిపోతోంది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు రావడంతో ఇంకా జోష్ పెరిగింది. ఎవరకి వాళ్లు తామే కంటెండర్ కావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, గీతూ రాయల్ మాత్రం అందరి ఆశలమీద నీళ్లు చల్లుతోంది. మొత్తం ఐదుగురు సభ్యులను ఆమె డిస్కాలిఫై చేసి గేమ్ మొత్తాన్ని మార్చేసింది. చివరికి ఆమె బొమ్మను కూడా లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేసి ఆమెను కూడా గేమ్ నుంచి దూరం చేశారు. కానీ, ఆమెను ఓడించేందుకు హౌస్ మొత్తం కలిసి పోరాడాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆమె స్ట్రాటజీల ముందు ఎవరూ నిలబడలేకపోయారు. మొత్తానికి గీతూని అడ్డు తొలగించుకున్నారు.
అయితే గేమ్ జరుగుతున్న సమయంలో మంగళవారం రాత్రి ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే గీతూని ఓడించేందుకు ఎంత మంది కష్టపడ్డారు అని. అందరూ నిద్రపోయిన తర్వాత గీతూ శ్రీహాన్ బొమ్మను తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేసింది. అయితే ఆమె బొమ్మను తీసుకెళ్లి పడేసేందుకు శ్రీహాన్ ఎంతో కష్టపడ్డాడు. ఆమె నిద్రపోయిన తర్వాత శ్రీహాన్ ఆమె బెడ్ దగ్గరకు వెళ్లాడు. ఆమె బొమ్మను జర్కిన్‌లో పెట్టుకుని పడుకుని ఉందనుకుని భావించాడు. నిజానికి ఆమె బొమ్మను స్టోర్ రూమ్‌లో దాచింది. అలా అనుకున్న శ్రీహాన్ ఎలాగైనా ఆమె బొమ్మను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు ఆమె బాగా నిద్రలో ఉండగా.. జర్కిన్ జిప్ తీసేందుకు ప్రయత్నించాడు. అది ఎంతకు రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాడు.
అయితే లేడీ కంటెస్టెంట్ జర్కిన్ ఎలా తీస్తాడు అంటూ ఎవరైనా ప్రశ్నించవచ్చు. నిజానికి గీతూ విషయంలో మాత్రం ఆ ప్రశ్న అడిగేందుకు వీలు లేదు. ఎందుకంటే నేను అక్కడ దాచుకుంటే ఎవరైనా సరే అక్కడ చేయి పెట్టి బొమ్మను తీసుకునేందుకు ప్రయత్నాలు చేయచ్చు అని ఆమె గతంలోనే స్టేట్మెంట్ పాస్ చేసింది. అయితే శ్రీహాన్ అలా చేసిన విషయం ఆమెకి మాత్రమే కాదు.. ఇంట్లోని ఎవరికీ తెలియదు. శ్రీహాన్ తర్వాత అర్జున్న కల్యాణ్ బొమ్మను తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేశాడు. అయితే శ్రీహాన్ అలా చేస్తాడు అని ఎవరూ ఊహించలేదు. ఎలాగైనా గీతూని ఓడించాలని శ్రీహాన్ ఆ ప్రయత్నం కూడా చేశాడు. శ్రీహాన్- గీతూ రాయల్ తో అలా చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.