బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో ఫుల్ జోష్‌గా నడుస్తోంది. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు సిసింద్రీ అనే టాస్కు పెట్టారు. దానిలో మొదటి రౌండ్‌లో చంటి విజయం సాధించి మొదటి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. హౌస్‌లో మొత్తం తమకు అప్పగించిన బొమ్మలను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. టాస్కులో గెలిచేందుకు గీతూ రాయల్ స్ట్రాటజీలు వాడుతూ దూసుకుపోతోంటే.. ఆమెను ఓడించేందుకు ఇంట్లోని సభ్యులు ఒక్కటిగా పోరాడుతున్నారు. అంతా రాత్రి నిద్ర కూడా పోకుండా తెగ ప్రయత్నించారు. ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారా అని ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ టాస్కు వల్ల హౌస్‌లో గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి.
అయితే రెండోవారం నామినేషన్స్ లో అంతా షానీ సాల్మన్‌ని నామినేట్ చేస్తూ నువ్వు మాస్క్ వేసుకున్నావ్, నీకు రెండో ఫేస్ ఉంది, అసలు కోపం రావట్లేదని కారణంగా చెప్పి నామినేట్ చేశారు. అయితే తాజాగా షానీ సాల్మన్ తన కోపాన్ని ప్రదర్శించాడు. అది కూడా మామూలుగా కాదు ఓ రేంజ్‌లో హౌస్‌లోని సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకు అంతా నోరెళ్లబెట్టారు. కెప్టెన్సీ టాస్కులో ఎవరి బొమ్మలను వాళ్లు కాపాడుకోవాలి. అంతేకాకుండా అజాగ్రత్తగా ఉంటే పక్కవాళ్లు లాక్కెళ్లచ్చు. ఒకరి బొమ్మలను లాక్కునేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు. అలా చేసేవారికి షానీ సాల్మన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
“నా బొమ్మ జోలికి ఎవరూ రావొద్దు. ఎవరైనా నా బొమ్మ లాక్కోవాలని చూస్తే.. డైరెక్ట్ కొట్టేస్తా. కొట్టడం కూడా అలా ఇలా కాదు కొడితే ఇంజురీ అయితది. ముందే చెప్తున్నాను తర్వాత నన్ను అనద్దు” అంటూ షానీ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే షానీ మాస్ వార్నింగ్ చూసి ఇంట్లోని సభ్యులు అంతా షాకయ్యారు. తేరుకుని షానీ కామెంట్స్ గురించి డిస్కస్ చేశారు. అలా ఎలా చెప్తావు అంటే అందుకు షానీ ఆడేసమయంలో చేతులు తగిలి కిందపడి దెబ్బలు తగిలితే నాకు సంబంధం లేదంటాడు. వాళ్లంతా నువ్వు నేరుగా కొట్టేస్తా అని చెప్తున్నావంటూ వాదిస్తారు. షానీ కూల్‌గా ఇదంతా గేమ్ అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో షానీ గెలుస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.