బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతోంది. ఈ టాస్కులో గెలవాలంటే తమకు అప్పగించిన బొమ్మను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాని అవసరాలు తీరుస్తూ ఉండాలి. కన్న బిడ్లా చూసుకోవాలి. ఈ టాస్కులో మొదటి రౌండ్‌లోనే విజయం సాధించి చంటి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. అయితే రెండో రౌండ్‌లో గెలిచేందుకు హైస్‌మేట్స్ మొత్తం తెగ తిప్పలు పడుతున్నారు. వారిలో గీతూ రాయల్ మాత్రం చిత్తూరు చిరుత అనిపించుకుంటోంది. ఆమె చాలా మంది బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేసి వారిని డిస్కాలిఫై అయ్యేలా చేసింది. ఆమెను ఓడించేందుకు సభ్యులు మొత్తం ఒక గ్రూప్‌గా ఆడారు.
గీతూ రాయల్‌ని ఓడించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమె తెలివిగా స్టోర్ రూమ్‌లో ఆమె బొమ్మను దాచిపెట్టింది. కానీ, పదో రోజు ఉదయం ఆ బొమ్మ రేవంత్‌కు దొరికింది. వెంటనే వెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేశాడు. కానీ, అక్కడ కూడా రేవంత్ ఆమెపై విజయం సాధించలేకపోయాడు. ఎందుకంటే గీతూ వాళ్లందరి కంటే పది అడుగులు ముందే ఉంది. ఆమె బొమ్మకు డ్రెస్ తీసేసి పేరు లేకుండా చేసింది. దొరికినా కూడా అది తన బొమ్మ కాదని నమ్మించింది. ఆ తర్వాత బాలాదిత్య దగ్గర బొమ్మ తీసుకుని దానికి గీతూ డ్రెస్ వేసింది. అది తన బొమ్మ అని వాదించింది. ఇంట్లోనీ సభ్యులు అంతా దానిని అంగీకరించకపోయినా కూడా.. బిగ్ బాస్ చెప్పేదాకా ఇవ్వను అని కూర్చుంది. నిజానికి గీతూ గేమ్ స్ట్రాటజీ చూసి ఇంట్లోని సభ్యులే కాదు ప్రేక్షకులు సైతం నివ్వెర పోయారు.
ఈ అమ్మాయి ఇంత తెలివిగా ఎలా ఆలోచిస్తోంది? ఎలా ఆడగలుగుతోంది? హౌస్ మొత్తాన్ని వణికిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి గీతూ రాయల్‌పై నెగెటివిటి తగ్గి.. ఫ్యాన్స్ పెరిగి పోయారు. చివరికి హౌస్ మొత్తం ఒక్కటయ్యి గీతూ రాయల్ బొమ్మను లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేశారు. అయితే అందరికీ గీతూకీ ఇక్కడ బాగా తేడా తెలుస్తుంది. అదేంటంటే.. గీతూ అస్సలు డీలా పడలేదు. అందరిలా నువ్వే నా బొమ్మను తీసుకెళ్లావ్ అంటూ ఎవరినీ నిందించలేదు. ఎంతో హుందా, ఫన్నీగా తీసుకుంది. పైగా లాస్ట్ అండ్ ఫౌండ్ దగ్గరకి వెళ్లి బొమ్మా పోయి వాళ్లందరినీ గుద్దూ అంటూ ఎంతో ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. గీతూ రాయల్ గేమ్ స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.