ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి పోలీసులకు అల్టీమేటం ఇచ్చారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. తన ముఖ్య అనుచరులు తాటి వెంకటేశ్వరరావు తో పాటు మరికొందరిని అరెస్టు ను ఖండిస్తున్నామన్నారు. నా అనుచురులను బెదిరించి.. అరెస్ట్ చేయించి సజ్జల సంతోషపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా అనుచరులను ఎందుకు? నన్ను కూడా అరెస్ట్ చేసుకోవొచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోటం. కేసు నమోదు అయి నాలుగు నెలలు అవుతుంటే.. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
మాజీ కార్పోరేటర్ వైసీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు నెలల క్రితం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కోటం రెడ్డి అనుచరులు మైనార్టీ సెల్ నాయకుడు జావెద్, మన్నేపల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరా తీయగా.. ముందుగా ఈ విషయంపై పోలీసులు కన్ఫామ్ చేయలేదు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో తన అనుచరుల గురించి వాకబు చేయగా అక్కడ కూడా కనిపించలేదు. చివరికి వారు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు కోటం కి చెప్పారు.
ఇదిలా ఉంటే.. అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లో కోర్టు లో ప్రవేశ పెట్టాలని.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులకు అల్టిమేటం జారీచేశారు. అయితే తెల్లవారే సరికే పరిణామాలు మొత్తం మారిపోయాయి.. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు జైలుకి తరలించారు. దీనిపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు.. అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం 6 లోపు ప్రవేశ పెట్టాలి.. లేదంటే ఎస్పీ ఆఫీస్ ముందు ఆమరణ దీక్ష చేస్తానని మరోసారి అల్టిమేటం ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.