ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి(34) శుక్రవారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఓ అపార్ట్ మెంట్ లోని రూ.101వ నెంబరు ఫ్లాటులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫాటుకు వచ్చి రెండు,మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట ఇక్కడి వచ్చిన ఆయన శుక్రవారం నిర్జీవ స్థితిలో కనిపించారు. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి పేరు మహేశ్వర్ రెడ్డి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. మంజునాథ్ భార్య స్రవంతి వైద్యురాలు. మంజునాథ్ రెడ్డి మృతితో.. ఆయన స్వగ్రామమైన పప్పిరెడ్డిగారిపల్లెలో విషాదం అలుముకుంది.