ఇటీవల కాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి. గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ లాడ్జీలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది మరణించారు. అలానే బోయిన్ పల్లి ప్రాతంలో ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుమంది మరణించగా పలువురికి గాయాలయ్యాయి. తాజాగా విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
వైజాగ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని ఆర్ఎంహెచ్ పీ డిపార్ట్మెంట్ లోని ఓ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. కొంత సమయానికి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన సిబ్బంది..అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాప సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కన్వేయర్ బెల్లుడు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు.