అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం దగ్గర బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ఓ రైతుకి చెందిన పొలంలో మొక్కజొన్న కంకులు కోయడం కోసమని మహిళా కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్న సమయంలో 33కేవీ విద్యుత్ లైన్ తెగి ట్రాక్టర్ పై పడింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని బళ్లారి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై రాయదుర్గం […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి(34) శుక్రవారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఓ అపార్ట్ మెంట్ లోని రూ.101వ నెంబరు ఫ్లాటులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫాటుకు వచ్చి రెండు,మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట ఇక్కడి వచ్చిన ఆయన శుక్రవారం నిర్జీవ […]