ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించే స్థలం.. నిత్యం ఎవరో ఒకరు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుపోతూ ఉంటారు. అలాంటి వారికి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లు వ్యవస్థను తీసుకు వచ్చారు.
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ప్రభుత్వ వ్యవస్థలు నియమ నిబంధనలతో.. ఎప్పుడు ప్రజలకు సేవచేసే విధంగా ఉండాలి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. అలాంటిది గ్రామ వాలంటీర్లు సచివాలయంలో చిందులు వేసి రచ్చ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలో కి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ వార్డు సచివాలయంలో వాలంటీర్లు చేసిన నిర్వాకం విమర్శలకు దారి తీసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
సోమవారం సచివాలయాన్ని సిబ్బంది, వాలంటీర్లు డాన్స్ ఫ్లోర్ గా మార్చేశారు. విధులు నిర్వహించకుండా సినిమా పాటలకు డాన్సులేశారు. మన్మధ రాజా… మన్మధ రాజా అంటూ వాలంటీర్లు స్టెప్పులేశారు. తామేదో గొప్ప పని చేసినట్లుగా దాన్ని ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయ్యి విమర్శలకు దారితీసింది. ఈ విషయం కమీషనర్ దృష్టికి వెళ్లడంతో ఆ ఇద్దరు వాలీంటర్లను విధులనుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే.. పార్టీలు చేసుకొంటూ ప్రభుత్వాన్ని విమర్శల పలు చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.