ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే వెంటనే సానుకూలంగా స్పందించి.. సమస్యను పరిష్కరిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తాజాగా వాలంటీర్లు తీసుకువచ్చిన ఓ సమస్యపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థను ఎందరో మెచ్చుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా చేర్చడం కోసం ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు జగన్. ఫించన్ మొదలు.. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా పనులను వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చాలా సులభంగా ప్రజలకు చేరువ చేశారు సీఎం జగన్. ఈ క్రమంలో గ్రామ వాలంటీర్లకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఇంతకు అది ఏంటంటే.. గ్రామ వాలంటీర్లకు నెలకు 2500 రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నారు. మార్చి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే వాలంటీర్లందరికి ఇది వర్తించదు. మరి ఈ పెన్షన్ ఎవరికి వస్తుంది అంటే..
అమరావతిలో భూమిలేని నిరుపేదలకు ప్రతి నెల 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇక మీదట భూమిలేని అమరావతి గ్రామాల వాలంటీర్లకు కూడా 2500 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. మార్చి 1 నుంచి ఈ వాలంటీర్లకు పెన్షన్ అమలు చేయనున్నారు.. సుమారు 200 మంది అమరావతి గ్రామాల వాలంటీర్లకు ఈ పింఛన్ మంజూరు చేయనున్నారు. ఓ ప్రత్యేక ప్రకటన ద్వారా రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్.వై శ్రీలక్ష్మి గురువారం ఈ విషయాన్నివెల్లడించారు.
ఇటీవల శ్రీలక్ష్మి అమరావతి గ్రామాలలో పర్యటించారు. ఈ సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని శ్రీలక్ష్మిని అభ్యర్థించారు. విషయం తెలుసుకున్న వెంటనే శ్రీలక్ష్మి దీనిపై సానుకూలంగా స్పందించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం జగన్‌కు ఈ సమస్యను వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.
అమరావతి గ్రామాలకు చెందిన నిరుపేద వాలంటీర్ల కుటుంబాలకు పింఛన్లు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. మార్చి 1 నుంచి ప్రతి నెలా భూమి లేని నిరుపేద గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు పింఛను రూ.2,500 మంజూరు ఇస్తారు. ఈ నిర్ణయంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.